త్రివిక్రమ్ నా రియల్ లైఫ్ గ్లాస్ మేట్

Mon Apr 15 2019 13:28:53 GMT+0530 (IST)

Trivikram Is My Real Life Glassmate Says Comedian Sunil

హీరోగా సక్సెస్ లు రాకపోవడంతో మళ్లీ ఏడాదిగా కమెడియన్ గా సినిమాలు చేస్తున్న సునీల్ కు ఎట్టకేలకు 'చిత్రలహరి' చిత్రంతో సక్సెస్ మరియు కమెడియన్ గా గుర్తింపు దక్కింది. హీరో సాయి ధరమ్ తేజ్ కు సినిమాలో గ్లాస్ మేట్ గా సునీల్ కనిపించాడు. ఆకట్టుకునే నటనతో పాటు తనదైన శైలి కామెడీ టైమింగ్ తో సునీల్ ఫామ్ లోకి వచ్చాడనేలా చిత్రలహరి చిత్రంలో నటించాడు. సునీల్ ఇక మళ్లీ కమెడియన్ గా బిజీ అవ్వడం ఖాయంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ గ్లాస్ మేట్ గురించి చెప్పుకొచ్చాడు.సునీల్ మాట్లాడుతూ.. నా రియల్ లైఫ్ గ్లాస్ మేట్ త్రివిక్రమ్. భీమవరంలో ఉన్న సమయంలో నా కంటే త్రివిక్రమ్ ఒక ఏడాది సీనియర్. అయితే సినిమాలపై ఆసక్తితో నేను త్రివిక్రమ్ కంటే ముందే హైదరాబాద్ వచ్చాను. కొన్నాళ్లకు నేను నా కోసం త్రివిక్రమ్ ను తీసుకు వచ్చాను. నా జీవితంలోని ప్రతి విషయం ప్రతి సంఘటన గురించి త్రివిక్రమ్ తో చర్చిస్తాను. ఏ సమస్యలో ఉన్నా ఎంత పెద్ద బాధలో ఉన్నా కూడా త్రివిక్రమ్ తో కొద్ది సమయం మాట్లాడితే చాలా ఎనర్జీ రావడంతో పాటు చాలా పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది. అందుకే ఇప్పటికి నెలలో కనీసం రెండు సార్లు అయినా నేను త్రివిక్రమ్ ను కలుస్తూ ఉంటాను.

కమెడియన్ గా స్ట్రగుల్ పడుతున్న సమయంలో త్రివిక్రమ్ ఆదుకున్నాడు ఆ తర్వాత హీరోగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా త్రివిక్రమ్ వెన్నంటి నిలిచాడు. అందుకే త్రివిక్రమ్ నా రియల్ లైఫ్ బెస్ట్ గ్లాస్ మేట్ అంటూ సునీల్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో సునీల్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు.