Begin typing your search above and press return to search.

ఆచార్య నుండి త్రిష తప్పుకోవడంపై చిరు క్లారిటీ

By:  Tupaki Desk   |   9 April 2020 4:45 AM GMT
ఆచార్య నుండి త్రిష తప్పుకోవడంపై చిరు క్లారిటీ
X
మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ లో హీరోయిన్‌ గా త్రిష ఎంపిక అయిన విషయం తెల్సిందే. ఆమె హీరోయిన్‌ గా ఎంపిక అయిన తర్వాత దాదాపు రెండు నెలలకు షూటింగ్‌ కు హాజరు అయ్యింది. ఒకటి రెండు రోజులు షూటింగ్‌ లో పాల్గొన్న వెంటనే త్రిష క్రియేటివ్‌ డిఫరెన్స్‌ అంటూ తప్పుకున్న విషయం తెల్సిందే. ఆచార్య నుండి తప్పుకుంటున్నట్లుగా మొదట త్రిష సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇన్నాళ్లు చిత్ర యూనిట్‌ సభ్యులు త్రిష తప్పుకోవడం గురించి స్పందించింది లేదు. త్రిష తప్పుకోవడంతో కాజల్‌ను ఆస్థానంలోకి తీసుకోవడం జరిగింది.

ఎట్టకేలకు చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై స్పందించాడు. చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఎవరితోనూ త్రిషకు క్రియేటివ్‌ డిఫరెన్స్‌ లేదు. నేను అందరితో మాట్లాడాను. ఎవరు కూడా ఆమెతో గొడవ లేదన్నారు. ఎవరితో విభేదాలు లేకుండానే ఆమె సినిమా నుండి తప్పుకున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నాడు.

మణిరత్నం సినిమాలో ఆమెకు ఛాన్స్‌ రావడంతో ఆ సినిమాకు ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ కారణంగానే ఆచార్య నుండి తప్పుకున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నాడు. ఆచార్య షూటింగ్‌ మళ్లీ ఎప్పుడు మొదలు పెట్టే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. ప్రస్తుత పరిస్థితులు సర్దుమనిగి అంతా సెట్‌ అయ్యే వరకు షూటింగ్స్‌ చేయడం కష్టమే అన్నారు.