Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: త‌్రిష కొత్త లుక్ తో స‌డెన్ షాక్

By:  Tupaki Desk   |   2 July 2020 7:10 AM GMT
ఫోటో స్టోరి: త‌్రిష కొత్త లుక్ తో స‌డెన్ షాక్
X
చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే! అంటారు. ఇదిగో ఇక్క‌డ లేటెస్ట్ ఫోటోలో త్రిష మేకోవ‌ర్ చూస్తే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. అంత‌గా ఏం చేసిందో కానీ... అమాంతం ఆ రూప‌మే మారిపోయింది. అస‌లు నిన్న‌గాక మొన్న టీనేజీలో ప్ర‌వేశించిందా? అన్న‌ట్టుగానే ఉంది మ‌రి. 30 ప్ల‌స్ లోనూ ఈ అమ్మ‌డి నిత్య‌నూత‌న రూపం షాక్ మీద షాకిస్తోంది.

అస‌లు ఇంత‌గా ఎందుకు మారిపోయింది? అంటే అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. త్రిష ప్రస్తుతం గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `విన్న‌య్ తాండి వ‌రువాయే` (ఏమాయ చేశావే) సీక్వెల్లో న‌టించాల్సి ఉంటుంది. శింబు - త్రిష జంట‌గా గౌత‌మ్ మీన‌న్ ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇటీవ‌లే కార్తీక్ డ‌య‌ల్ సేత ఏన్ .. అంటూ ల‌ఘు చిత్రాన్ని రిలీజ్ చేశారు. చాలా గ్యాప్ త‌ర్వాత సీక్వెల్ ఆలోచ‌న కాబ‌ట్టి అభిమానుల‌కు ట‌చ్ లోకి వెళ్లేందుకు ఇదో త‌ర‌హా ఎత్తుగ‌డ అని భావించారంతా. ``లాక్ డౌన్ స్టార్ట‌వుతోంది. సెల్ఫ్ ఐసోలేష‌న్ లోకి వెళ‌తాం.. క‌ల‌వ‌లేం!`` అంటూ త్రిష ఎమోష‌న‌ల్ సీన్ ఆక‌ట్టుకుంది. ఇక ధృవ‌న‌క్ష‌త్రం చిత్రీక‌ర‌ణ స‌హా త‌దుప‌రి వీఐటీ సీక్వెల్ స్క్రిప్టును గౌత‌మ్ రెడీ చేస్తార‌న్న ప్ర‌చారం ఉంది. అయితే దీనిపై గౌత‌మ్ వెర్ష‌న్ ఏమిట‌న్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.

అదంతా స‌రే కానీ.. ఉన్న‌ట్టుండి ఇంత‌లోనే అంత వెయిట్ ఎలా త‌గ్గిందో కా‌నీ ఎంత‌టి మార్పు ఇది. 90 ఎంఎల్ త‌ర్వాత మ‌ళ్లీ త‌దుప‌రి ప్రాజెక్టును త్రిష‌ అంత ఛాలెంజ్ గా తీస్కుందా? ఆ చెమ‌ట‌లు ప‌ట్టిన దేహ‌శిరుల ఫోటోల‌ని త్రిష ఇలా షేర్ చేయ‌డంతో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. త్రిష స్ట‌న్నింగ్ లుక్ వైర‌ల్ గా మారింది. ఆ టైట్ టాప్ .. బాట‌మ్ స్పోర్ట్ డ్రెస్ సంథింగ్ స్పెష‌ల్ అనుకుంటే.. ఆ టాప్ లో ప‌చ్చ‌బొట్టు అంత‌కుమించి హైలైట్. మొత్తానికి త్రిష ఈజ్ బ్యాక్ అని చెప్పాలి.