Begin typing your search above and press return to search.

త్రిష మేక‌ప్ లెస్ ఫోజు.. చూస్తే షాక్ తింటారు

By:  Tupaki Desk   |   9 July 2020 4:30 AM GMT
త్రిష మేక‌ప్ లెస్ ఫోజు.. చూస్తే షాక్ తింటారు
X
దాదాపు రెండు ద‌శాబ్ధాల కెరీర్ జ‌ర్నీని ఎంతో చాక‌చ‌క్యంగా నెట్టుకొచ్చేసింది అందాల త్రిష‌. ఆ న‌వ్వుకు ప్ర‌త్యేకించి ఫ్యాన్సుంటారు. త్రిష అల్ల‌రికి కొంటె వేషాల‌కు భారీగానే ఫ్యాన్సున్నారు. అందానికి అందం ప్ర‌తిభ ఇవ‌న్నీ ఒకేచోట రాశిగా పోసిన‌ట్టు కుదిరాయి కాబ‌ట్టే త్రిష ఏం చేసినా చెల్లిపోయింది. అదంతా స‌రే కానీ ఈ అమ్మ‌డు ఇప్ప‌టికీ త‌న కెరీర్ బండిని సాఫీగా సాగించేందుకు చేయాల్సిన‌ది అంతా చేస్తూనే ఉంది. ఓవైపు త్రిష‌కు పెళ్లి అంటూ కోలీవుడ్ మీడియా ప్ర‌చారం చేస్తున్నా.. దానికి సంబంధించి అధికారిక విష‌యాలేవీ బ‌య‌ట‌కు రాలేదు.

ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు డిజిటల్ రంగంలో ప్ర‌వేశిస్తోంది. క‌థానాయిక‌ల్లో స‌మంత- కాజ‌ల్- త‌మ‌న్నా వంటి స్టార్ హీరోయిన్స్ ఓటీటీ వైపు అడుగులేశారు. ఇప్పుడు త్రిష అదే బాట‌లో వెళ్ల‌నుందిట‌. తండ్రీ- కూతురు మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో తెర‌కెక్క‌నున్న ఓ వెబ్ సిరీస్ లో న‌టించ‌నుంది. రామ్ సుబ్ర‌మ‌ణ్య‌న్ ఈ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఓవైపు ఇదంతా ఇలా ఉంటే మ‌రోవైపు త్రిష సోష‌ల్ మీడియా ఫోటోలు అంతే జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా త్రిష మేక‌ప్ లెస్ లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అస‌లు ఇది ఎవ‌రు? త్రిష నే క‌దా? అంటూ అభిమానులు క‌న్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంత‌గా లుక్ ప‌రంగా డిఫ‌రెన్స్ క‌నిపిస్తోంది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమాలో న‌టించేందుకు త్రిష రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.