పురుషుల ప్రపంచంలో ధీరవనిత!

Thu Jul 07 2022 14:00:01 GMT+0530 (IST)

Trisha Look From Ponniyan Selvan

దిగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరపైకి తీసుకొస్తున్న భారీ పీరియాడికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్'. గత కొంత కాలంగా ఈ పీరియాడికల్ డ్రామాని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేసిన మణిరత్రం ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ ముందుకు రావడంతో ఈ భారీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. విక్రమ్ ఆదిత్య కరికాళన్ గా కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.అందులో పార్ట్ 1 ని PS - 1 గా సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ పీరియాడికల్ మూవీలోని కీలక పాత్రలని పరిచయం చేయడం మొదలు పెట్టింది. ముందుగా కీలక పాత్రలో నటిస్తున్న విక్రమ్ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ని విడుదల చేసింది.

సినిమాలో విక్రమ్ ఆదిత్య కరికాళన్ గా వైల్డ్ టైగర్ గా కనిపించబోతున్నారు. ఛోళ ఎంపైర్ కింగ్ గా విక్రమ్ కనిపించబోతున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా వందియదేవుడి పాత్రలో కార్తి కనిపించబోతున్నారు.

ఈ రెండు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లని విడుదల చేశారు. తాజాగా ఐశ్వర్యరాయ్ పాత్రకు సంబంధించిన టుక్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందంగా కనిపించే ఈ యువతి ప్రతీకారానికి ప్రతిరూపం అంటూ ఐష్ పాత్రని పరిచయం చేశారు.

తాజాగా గురువారం త్రిష పాత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ మూవీలో త్రిష యువరాణి కుందవాయిగా నటిస్తోంది. పురుషుల మధ్య ధైర్య సాహసాలు గల యువతిగా త్రిష పాత్ర వుంటుందని తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ పాత్రతో త్రిష .. హీరో కార్తికి జోడీగా వందియదేవుడి పట్టపురాణిగా కనిపించనుంది. యువరాణి లుక్ లో కనిపిస్తున్న త్రిష లుక్ ని విడుదల చేసిన మేకర్స్ దీనికి ఆసక్తికరమైన క్యాప్షన్ ని జత చేశారు. 'పురుషుల ప్రపంచంలో ధైర్యం ఉన్న స్త్రీ.. యువరాణి కుదవాయిని పరిచయం చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు.