Begin typing your search above and press return to search.

#CHIRU 152: త్రిష అలా అనేసిందేమిటి!

By:  Tupaki Desk   |   15 Dec 2019 6:51 AM GMT
#CHIRU 152: త్రిష అలా అనేసిందేమిటి!
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న 152వ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు? అన్న దానిపై కొద్ది రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. స్టాలిన్ లో చిరంజీవి స‌ర‌స‌న న‌టించిన త్రిష నే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఎంపిక చేసిన‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగింది. అంత‌కు ముందు అనుష్క‌.. న‌య‌న‌తార ఇలా ప‌లువురి భామ‌ల పేర్లు వినిపించాయి. తాజాగా వాట‌న్నింటికి తెర దించుతు త్రిష క్లారిటీ ఇచ్చేసింది. అవును.. మెగాస్టార్ స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్ నేనే అంటూ కుండ‌బ‌ద్దలు కొట్టేసింది.

ఓ సినీ విశ్లేష‌కుడు ఈ ఏడాది త్రిష మూడు సినిమాల్లోన‌టిస్తోంద‌ని ట్వీట్ చేసాడు. మ‌ణిర‌త్నం పోయిన్నియ‌న్ సెల్వ‌న్ తో పాటు చిరంజీవి-కొర‌టాల సినిమాలో త్రిష హీరోయిన్ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసి త్రిష ఈ విధంగా స్పందించింది. ``అవును ఇది నిజ‌మే!`` అంటూ విక్ట‌రీ ఎమోజీతో పాటు#2020 ట్యాగ్ ను జ‌త చేసింది. దీంతో నెటిజ‌నులు త్రిష‌నే మెగా నాయిక‌గా ఖ‌రారు చేసారు. త్రిష తెలుగు సినిమాల్లో న‌టించి మూడేళ్ల‌కు పైగా అవుతోంది. చివ‌రిగా `నాయ‌కి` అనే లేడీ ఓరియేంటెడ్ సినిమాలో క‌నిపించింది. కానీ ఆ సినిమా ప‌రాజ‌యం పాలైంది.

ఆ త‌ర్వాత ఈ చెన్న‌య్ చంద్రం పూర్తిగా త‌మిళ సినిమాలతోనే బిజీ అయింది. తాజాగా మ‌ళ్లీ చిరు సినిమాతో టాలీవుడ్ లోకి మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత ఎంట్రీ ఇస్తోంది. మెగా బాస్ స‌ర‌స‌న ఛాన్స్ అందుకోవ‌డం అంటే అది చాలా గొప్ప విష‌య‌మే. నాయిక‌ల మ‌ధ్య ఎంతో కాపింటిష‌న్ ఉన్నా అమ్మ‌డిని అవ‌కాశం వెదుక్కుంటూ మ‌రీ వెళ్లింది. మ‌రి మునుపటి క్రేజ్ ను తిరిగి అందుకోగ‌ల‌దా? లేదా? అన్న‌ది వేచి చూడాలి.