రవితేజ తో చేయాల్సిన సినిమాని విశ్వక్ తో చేస్తున్నారా..?

Thu Jun 10 2021 09:00:01 GMT+0530 (IST)

Trinadha Rao nakkina with vishwak

'సినిమా చూపిస్తా మావా' 'నేను లోకల్' వంటి సినిమాలతో విజయాలు అందుకున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశారు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో కలసి వర్క్ చేసిన స్క్రిప్ట్ తో రవితేజ ను మెప్పించారని.. ఈ కోర్టు డ్రామాలో ఆయన లాయర్ గా కనిపిస్తారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యమని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని రవితేజ తో కాకుండా వేరే హీరోతో చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం 'ఖిలాడీ' చిత్రంలో నటిస్తున్న రవితేజ.. ఇటీవల శరత్ మండవ దర్శకత్వంలో ఓ మూవీని ప్రారంభించారు. దీంతో రవితేజ తో సినిమా లేట్ అవుతుండటంతో.. వరుణ్ తేజ్ కు త్రినాథరావు - ప్రసన్న కుమార్ ఓ కథ వినిపించారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు వీరిద్దరూ ఓ కథ చెప్పారని.. దీనికి హీరో సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మరో వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు రవితేజ తో చేయాల్సిన 'చెట్టుకింద ప్లీడర్' కథతోనే ఇప్పుడు విశ్వక్ ని ఒప్పించారని టాక్ నడుస్తోంది. మరి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.