ఫోటో స్టోరి: ఆ బాటిల్ బ్రాండ్ ఏమిటి అమ్మడూ?

Mon Oct 19 2020 06:00:02 GMT+0530 (IST)

Tridha Choudhury Shared Her Fascinating Pic In Instagram

4Gs కంటే పైన ఉన్నాను నేను.. గ్రాటిట్యూడ్.. ఎదుగుదల.. గ్లామర్.. గ్లోవింగ్ అన్నిటిలో అని అంటోంది త్రిధా చౌదరి. క్యూట్ లుక్స్ తో హాట్ అప్పియరెన్స్ ని మిక్స్ చేసి కుర్రకారు గుండెల్ని దోచేయడం ఈ అమ్మడి ప్రత్యేకత. తాజాగా గోవా బీచ్ లో వాలిపోయి ఇదిగో ఇలా చిలౌట్ చేస్తోంది. ఏకంగా 5జీ బ్రాండులా కనిపిస్తోంది బీచ్ పరిసరాల్లో.మొన్నటికి మొన్న `స్పాట్ లైట్` వెబ్ సిరీస్ లో అడ్డూ అదుపూ లేని పెదవి ముద్దులతో హీట్ పుట్టించిన త్రిధా .. ఇప్పుడిలా తీరిక సమయాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది. బికినీ బీచ్ పరిసరాల్లో ఖరీదైన బాటిల్ చేతపట్టి అగ్గి రాజేస్తోంది. ఆ బాటిల్ చూడగానే అందరిలో ఒకటే సందేహం. ఇంతకీ అది ఏ బ్రాండ్ ? అంటూ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

అదేమైనా ఖరీదైన విదేశీ షాంపైన్ బాటిలా? అంటూ ఒకటే ఇదైపోతున్నారు. మందుబాబులకు అయితే నాలుక పిడచకట్టేస్తోంది. ఇంతకీ మీలో గ్లో పెంచిన ఆ సీక్రెట్ బాటిల్ గుట్టు విప్పవా ప్లీజ్? అంటూ ఒకటే అడిగేస్తున్నారు. మరి త్రిధా వద్ద ఆన్సర్ ఉందా? ఆ రహస్యం చెబుతుందంటారా? గోవా డైరీస్ లో మరపురాని ఈ రోజుల్ని షాంపైన్ తో అలా అలా లాగించేస్తోందన్నమాట.