ట్రెండీ టాక్: షూటింగ్ సన్నాహాల్లో టాప్ 10 స్టార్లు

Thu Jun 10 2021 22:00:01 GMT+0530 (IST)

Trendy talk: Top 10 stars in shooting preparations

టాలీవుడ్ టాప్ 10 స్టార్లు సెట్స్ కెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లాక్ డౌన్ లు కొనసాగుతున్నా సడలింపులు ఉన్నాయి కాబట్టి ఇక షూటింగులు చేసేందుకు వేచి చూసే పరిస్థితి లేదు. కేవలం కొద్ది రోజుల్లో పూర్తయ్యే వాటి విషయంలో ఇక స్టార్లు వేచి చూసే ఆలోచనతో లేరు. అందుకే తదుపరి షెడ్యూల్స్ కోసం దర్శకనిర్మాతలకు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. ఇప్పటికే హీరోలతో పాటు చిత్రబృందాలు వ్యాక్సినేషన్  చేయించుకుని వార్ కి సిద్ధమవుతున్నారని తెలిసింది.రాధేశ్యామ్ - ఆచార్య చిత్రాలకు చిన్న పాటి పెండింగ్ చిత్రీకరణలు మిగిలి ఉన్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ పని పూర్తి చేయాలన్నది ప్లాన్. ప్రభాస్ ... చిరంజీవి .. చరణ్ వంటి స్టార్లు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేశారట. ఆర్.ఆర్.ఆర్ విషయంలో ప్రణాళిక ఏమిటన్నది జక్కన్న చెప్పాల్సి ఉంటుంది.

అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప పెండింగ్ చిత్రీకరణకు రెడీ అవుతుండగా.. మహేష్ సర్కార్ వారి పాట చిత్రీకరణకు వెళ్లనున్నారు.

పవన్ - అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ .. హరిహర వీరమల్లు షెడ్యూల్స్ ని మొదలు పెట్టుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేయమని తన దర్శకనిర్మాతల్ని అడిగారట. ఇలా ఇండస్ట్రీలో టాప్ 10 స్టార్లు షూటింగులకు రెడీ అవుతుండడంతో మళ్లీ పరిశ్రమకు కొత్త కళ రానుంది. ఇక ఇదే దారిలో ఇతర హీరోలు దర్శకనిర్మాతలు ప్లానింగ్ ని షురూ చేస్తారు. సాధ్యమైనంత వరకూ ప్రయాణాలు లేకుండా హైదరాబాద్ పరిసరాల్లోనే సెట్స్ వేసి చిత్రీకరణలు పూర్తి చేయాలన్న ఆలోచనలు చేస్తున్నారని తెలిసింది.