ట్రెండీ టాక్: ఇండస్ట్రీలో కాస్ట్ లీ హీరోయిన్స్

Tue Jul 20 2021 15:40:09 GMT+0530 (IST)

Trendy Talk: Cast Lee Heroines in the Industry

టాలీవుడ్ లో అత్యంత విలాసవంతమైన జీవన శైలిని కలిగిన కథానాయికలు ఎందరు? అంటే .. ఓ నలుగురు భామల పేర్లు  ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో అదృష్టం కలిసొచ్చి అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఓ కుర్రబ్యూటీ పేరు కూడా వినిపిస్తోంది. పలు నగరాల్లో సొంత బంగ్లాలు.. ఇంటి గ్యారేజీల్లో అరడజను హై ఎండ్ రిచ్ కార్లు.. వాటికి తోడు కట్టుకునే బట్టలు.. వినియోగించే హ్యాండ్ బ్యాగ్ .. పనివాళ్లకు జీతాలు వగైరా వగైరా చూస్తే ఈ భామల రేంజు ఆ లెవల్ అని అంగీకరించాల్సిందే.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా చెలామణి అవుతున్న భామల్లో సమంత- పూజాహెగ్డే- అనుష్క వంటి స్టార్లు స్వతహాగానే రిచ్. నిజానికి సమంత అక్కినేని కోడలిగా దర్పం ప్రదర్శించేందుకు ఆస్కారం ఉన్నా తాను ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ ని అనుకరించడంలో రిచ్ గా ఉన్నా.. అనవసరమైన ఆర్భాటాలకు హంగులకు వెళ్లరని చెబుతారు.

పూజా హెగ్డే నేటితరంలో అత్యంత భారీ ఆర్జన కలిగిన మేటి కథానాయికగా దూసుకుపోతోంది. తెలుగు-తమిళం-హిందీ భాషల్లో వెలిగిపోతోంది. అయినా చాలా సింపుల్ గా కనిపిస్తుంది. అయితే తనకు తొలి నుంచి సొంత బంగ్లా ఖరీదైన కార్లు ఉండే గ్యారేజీ ఉన్నాయి.

ఇక  అనుష్క శెట్టి ని స్వీటీ అని పిలిచినందుకైనా తన మృధుత్వం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరినీ హర్ట్ చేయని స్వీటీ శెట్టి ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటారు. పైగా డబ్బు ఉంది కదా! అని ఏదో ఒకటి కొనేసే రకం కాదు. తన పెట్టుబడులన్నీ రియల్ ఎస్టేట్ లో ఉన్నాయని చెబుతారు. ఇక వ్యక్తిగతంగా టూమచ్ గా విలాసాల జోలికి వెళ్లే తరహా కానేకాదని అంతా చెబుతారు.

అయితే ఆ ముగ్గురు భామల కంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయడంలో అందాల నయన తార ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. తన ఆలోచనలు కాస్త కాస్ట్ లీ. అయితే అది కెరీర్ ఆరంభంలో లేదు. ఇటీవలి కాలంలో స్టార్ డమ్ ని అజేయంగా ఆస్వాధిస్తున్న క్రమంలో ఒక్కో సినిమాకి ఐదు కోట్ల పారితోషికం అందుకునే రేంజుకు ఎదిగేసిన క్రమంలోనే తన దర్పం చూపిస్తున్నారు. ఎంతగా అంటే ఖరీదైన నగరాల్లో సొంత బంగ్లాలు.. ప్రియుడితో వెకేషన్ కి చార్టెడ్ ఫ్టైల్ లో వెళ్లడాలు .. ఇంటి గ్యారేజీలో డజను పైగా నే ఖరీదైన కార్లను కలిగి ఉండడం వగైరా వగైరా తనకు తన లైఫ్ స్టైల్ కి కొత్తేమీ కాదు.

కానీ ఇంకా ఇండస్ట్రీలో పట్టుమని పది సినిమాలైనా చేయని రష్మిక మందన మాత్రం అలా కాదు. తన రేంజు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే.. అనుష్క శర్మ రేంజులో ఉందని చెబుతున్నారు. నిజానికి ఆ ఇద్దరు కూడా తమ రేంజును చూపించేందుకు చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఇంతకాలానికి  స్టార్ హీరోయిన్లుగా ఆర్జిస్తున్నారు కానీ... సొంత సంపాదనతో జల్సాలు చేసేందుకు వారు ఎప్పుడూ ఇష్టపడలేదని చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

ఇక దీపిక అనుష్క శర్మతో పోలిస్తే రష్మిక రిచ్ మెయింటెనెన్స్ ఖరీదైన జీవనశైలి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు వచ్చింది. నేటితరం నాయికల్లోనే విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాధిస్తున్న బ్యూటీగా రష్మిక పేరు మార్మోగుతోంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఆస్తుల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నా కానీ...ఇండస్ట్రీలో ఎవరికీ తగ్గని రీతిలో అల్ట్రా రిచ్ జీవన శైలికి అలవాటు పడిందని విశ్లేషిస్తున్నారు. రష్మికకు ఒకటికి మంచి అరడజను పైగానే కార్లున్నాయి. ఆడి క్యూ 3.. మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్.. రేంజ్ రోవర్ ఎస్ యూవీ అనే మూడు లగ్జరీ కార్ల తో పాటు ఇన్నోవా క్రిస్టా .. హ్యుందాయ్ క్రెటా కూడా ఉన్నాయి. మూడ్ ని బట్టి వీటిని వాడుతుంది.


ఇటీవల ముంబైలో సొంత ఇంటిని కొనుక్కున్న రష్మికకు బెంగళూరులోనూ పెద్ద బంగ్లా ఉంది. కోట్లాది రూపాయల విలువైన విల్లాను కూడా కొనుక్కుందిట. అలాగే ఫ్యామిలీ బిజినెస్ లలోనూ రష్మిక పెట్టుబడులు పెడుతున్నారు. రూ.3-4 లక్షల రేంజు వరకూ పలు హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి.  అంతర్జాతీయ బ్రాండ్ కళ్ళజోళ్లను.. షూస్ ని ఉపయోగిస్తుంది. డిజైనర్ లుక్ కోసం లక్షలు ఖర్చు చేస్తుంది.

అయితే రష్మిక ఇదంతా చేసేందుకు అవసరమైన భారీ ఆదాయాన్ని కలిగి ఉంది. ఇప్పటికిప్పుడు తెలుగులో మూడు సినిమాలు.. హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. ఒక్కో సినిమాకి 2కోట్లు పైగా పారితోషికం అందుకుంటోంది. హిందీ చిత్రాలకు ఇంకా ఎక్కువే వసూలు చేస్తోందని సమాచారం. ఇలా అందే సొమ్ముల్ని రష్మిక విలాసాలకు ఖర్చు చేస్తోంది. పెట్టుబడులను పెడుతోందన్నమాట.