Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: న‌ట‌వార‌సురాళ్లు ప్రేమ క‌హానీలు!

By:  Tupaki Desk   |   25 Jun 2022 2:30 AM GMT
ట్రెండీ స్టోరి: న‌ట‌వార‌సురాళ్లు ప్రేమ క‌హానీలు!
X
స‌హ‌జంగానే స్టార్ల వార‌సులు ప్ర‌జ‌ల దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తారు. యువ‌త‌రంలో ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు కార‌ణం అవుతుంటారు. స్టార్ కిడ్స్ ల‌వ్ లైఫ్ గురించి క‌హానీలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో అమితాబ్ మ‌నవ‌రాలైనా ఖాన్ ల త్ర‌యం వార‌సులు అయినా.. లేదా ఎవ‌రైనా టీవీ న‌టి.. న‌టుల‌ వార‌సురాలు అయినా మొత్తానికి ఎఫైర్ మ్యాట‌ర్ అన్నివేళ‌లా హాట్ టాపిక్ గానే మారుతోంది.

సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ - టీవీ న‌టి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. నిరంత‌రం మీడియా కెమెరాల్లో ఈ జంట చిక్క‌డంతో ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. పాలక్ ప్ర‌తిసారీ త‌న ముఖాన్ని దాచడానికి ప్రయత్నించింది. కొన్నిసార్లు ఈ పుకార్లను కొట్టిపారేసింది. ఎందుకంటే ఆమె ఇప్పటికే తన తల్లికి అబద్ధం చెప్పి తన ముఖాన్ని దాచుకుంది అంటూ బాలీవుడ్ లో క‌థ‌నాలొచ్చాయి.

ఇబ్ర‌హీంతో సాన్నిహిత్యం పై ఇటీవ‌ల పుకార్లు లేవు. ఇంత‌లోనే మ‌రో యువ‌హీరోతో పాల‌క్ డేటింగ్ సంచ‌ల‌నంగా మారుతోంది. శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ తన డేటింగ్ పుకార్ల కారణంగా ఇప్పుడు మ‌రోసారి వార్తల్లో నిలిచింది. పాలక్ తివారీ త్వరలో ది 'అక్రిస్' తో అరంగేట్రం చేయబోతున్న వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తోంద‌నేది తాజా సంచలనం. గత రెండు సంవత్సరాలుగా ఈ జంట‌ డేటింగ్ చేస్తున్నారని.. పాలక్ తల్లి శ్వేత కూడా ఈ సంబంధంతో సంతోషంగా ఉన్నారని క‌థ‌నాలొస్తున్నాయి.

నవ్య నవేలి నందా- సిద్ధాంత్ చతుర్వేది ప్రేమాయ‌ణంపైనా ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఇంత‌లోనే నవ్య నవేలి నంద- సిద్ధాంత్ చతుర్వేది మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వారి నిరంతర సోషల్ మీడియాల‌ను ప‌రిశీలిస్తే.. మార్పు చేర్పులు సందేహానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఈ జంట‌ ప్రేమలో ఉన్నారని నెటిజ‌నులు ఊహిస్తున్నారు.

జావేద్ జాఫ్రీ కుమారుడు మీజాన్ జాఫ్రీ - అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో ప్రేమలో ఉన్నట్లు కూడా ఇంత‌కుముందు పుకార్లు వచ్చాయి. అయితే మీజాన్ మాత్రం తాము కేవలం స్నేహితులు మాత్రమేనని పేర్కొన్నారు.

క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ పై సుహానా ఖాన్ కు క్రష్ ఉందంటూ ఒక ప్ర‌చారం సాగింది. అతను SRK కి చెందిన‌ IPL జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ సభ్యుడు. దీంతో సుహానాకి ముడిపెట్టి క‌థ‌నాలు అల్లేస్తున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం అందుకు కార‌ణ‌మైంది.

అహన్ శెట్టి - తానియా ష్రాఫ్ న‌డుమ ఎఫైర్ క‌హానీ ఇటీవ‌ల వేడెక్కించింది. సునీల్ శెట్టి కుమారుడు అహాన్ అందాల‌ తానియా ష్రాఫ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. వాళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ కావ‌డం వ‌ల్ల ఈ పుకార్లు స‌హ‌జం అనేవారు లేక‌పోలేదు.

యువ‌హీరో శుభ్ మాన్ గిల్ తో ప‌లువురు భామ‌లు ఎఫైర్ సాగించిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. శుభమాన్ - సారా రిలేషన్ షిప్ లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. ఈ జోడీ ఇంత‌కుముందు వెకేష‌న్ లో కలిసి కనిపించారు. అనంత‌రం ఈ పుకార్లు అస్స‌లు ఆగ‌లేదు. క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ పై సుహానా ఖాన్ కే కాదు సారా టెండూల్క‌ర్ కు క్రష్ ఉందన్న ప్ర‌చారంతో ఏది నిజ‌మో కాస్త క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది.  బ‌హుశా అంద‌గాడు ప్ర‌తిభావంతుడైన శుభ్ మాన్ పై వేలాది మంది అమ్మాయిలు మ‌న‌సు పారేసుకోవ‌డం స‌హ‌జం. అతను SRK కి చెందిన‌ IPL జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ సభ్యుడు. అందువ‌ల్ల సుహానా - సారా టెండూల్క‌ర్ తో స‌న్నిహితంగా ఉంటే ఇలాంటి పుకార్లు కూడా స‌హ‌జంగానే పుడుతుంటాయ‌ని ఊహిస్తున్నారు.

ఇక అమీర్ ఖాన్‌ కుమార్తె ఇరా ఖాన్ ఫిట్నెస్ కోచ్ నూపుర్ శికారేతో ప్రేమాయ‌ణం సాగించ‌డం అధికారికంగా అంద‌రికీ తెలిసిన‌దే. ఈ జంట అన్యోన్య‌త ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు వ‌స్తుంటుంది. ఇరా ఖాన్ ఒంట‌రి జీవితం నుంచి డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఈ ప్రేమ ఎంతో స‌హ‌క‌రించింద‌ని త‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది.

ఇక జాన్వీ క‌పూర్ .. అన‌న్య పాండే లాంటి నాయిక‌ల‌పైనా ఎఫైర్ క‌హానీలు నిరంతరం వింటున్న‌వే. వీళ్లంతా స‌హ‌చ‌రుల‌తో స‌న్నిహితంగా మెలిగే క్ర‌మంలో ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. కోస్టార్ ల‌తో ప్రేమాయ‌ణాల‌పైనా నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది.

నాయ‌కుడి మ‌న‌వ‌డితో స్టార్ డాట‌ర్ ల‌వ్..సినీరంగ ప్ర‌ముఖుల‌తో రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు .. క్రీడాకారులు ప్రేమాయ‌ణాలు సాగించ‌డం రెగ్యుల‌ర్ గా చూసేదే. అల్ల‌రి హాసినిగా పాపుల‌రైన జెనీలియా.. మాజీ క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి త‌న‌యుడు హీరో రితేష్ ని పెళ్లాడారు. రితేష్ స‌ర‌స‌న న‌టించిన జెనీలియా అత‌డితో ప్రేమాయ‌ణం సాగించి అనంత‌రం పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడింది.

కానీ ఇటీవ‌ల‌ ఓ రాజ‌కీయ నాయ‌కుడి వార‌సుడితో షికార్లు చేస్తూ బాలీవుడ్  యువ‌నాయిక ఆల‌య‌ మీడియా క‌థ‌నాల్లో హైలైట్ అవుతోంది. బాలీవుడ్ న‌టి పూజాబేడి-ప‌ర్హాన్ ఫ‌ర్నిచ‌ర్ వాలా వార‌సురాలిగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన అల‌యా బేడి గ‌తేడాదే 'జ‌వానీ జనీమాన్' సినిమాతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే  ఆల‌యా ఇప్పుడు  శివ‌సేన అధినేత‌.. దివంగ‌త బాల్ ఠాక్రే మ‌న‌వడు ఐశ్వ‌రీ ఠాక్రే తో  చ‌నువుగా ఉంటోంద‌ని.. అత‌ని ప్రేమ‌లో మునిగింద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇరువురు చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న‌ట్లు ముంబై మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు  వేడెక్కిస్తున్నాయి. ఆల‌యా బేడి త‌న 22వ పుట్టిన రోజు వేడుక‌లు దుబాయ్ లో ఐశ్వ‌రీ ఠాక్రేతో క‌లిసి జ‌రుపుకున్నారు. ఈ వేడుకు ఠాక్రే కుటుంబ స‌భ్యులు సైతం హాజ‌రయ్యార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఎఫైర్ ప్ర‌చారంపై ఆల‌యా మీడియా క‌థ‌నాల్ని కొట్టి పారేసింది. ఐశ్వ‌రీ కేవ‌లం మంచి స్నేహితుడు మాత్ర‌మేన‌ని త‌ప్పుగా అర్ధం చేసుకోవ‌ద్ద‌ని పేర్కొంది. అలాగే అల‌యా త‌ల్లి కూడా ఈ ప్ర‌చారాన్ని ఖండించారు.