Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: నిజంగా సినిమా వాళ్ల‌కి బ్యాడ్ టైమ్!

By:  Tupaki Desk   |   23 July 2021 8:30 AM GMT
ట్రెండీ స్టోరి: నిజంగా సినిమా వాళ్ల‌కి బ్యాడ్ టైమ్!
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ స్టార్లంతా బిజీ అవుతున్నార‌ని భావిస్తే ఇంత‌లోనే ఏదో ఒక ఆప‌ద ముంచుకొస్తూ అన్నిటినీ డిస్ట్ర‌బ్ చేస్తోంది. ఇది నిజంగా సినీప‌రిశ్ర‌మ‌ల‌కు ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. ఒక సారి బ్యాడ్ టైమ్ స్టార్ట‌యితే దానివెంటే ఊహించ‌ని స‌మ‌స్య‌లు కూడా పుట్టుకొస్తాయి. అదే తీరుగా ఇప్పుడు అంతా బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. ఇలా క‌రోనా సెకండ్ వేవ్ రిలీఫ్ ఇచ్చింద‌ని భావించినా ఇంత‌లోనే భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వైర‌ల్ ఫీవ‌ర్లు విజృంభిస్తున్నాయి. మ‌రోవైపు అనుకోని ప్ర‌మాదాలు స‌మ‌స్య‌ల్ని కొని తెస్తున్నాయి. వెర‌సి షూటింగుల‌కు బ్రేక్ ప‌డుతోంది. ఇటీవ‌లి కొన్ని ఇన్సిడెంట్స్ ని ప‌రిశీలిస్తే... నిజంగా సినిమా వాళ్ల‌కి బ్యాడ్ టైమ్ న‌డుస్తుంద‌ని చెప్పాలి. సెట్లో క‌రోనాని మించి ఊహించ‌ని ప్ర‌మాదాలు ఎదుర్కోక‌ త‌ప్ప‌డం లేదు.

తామ‌ర‌తంప‌ర‌గా ఇటీవ‌లి ఘ‌ట‌న‌ల‌ వివ‌రాల్లోకి వెళితే చాలా సంగ‌తులే తెలుస్తాయి. క్రైసిస్ మ‌ధ్య‌ థియేట‌ర్స్ తెరుస్తారో లేదో అనే డైలామాని ప‌క్క‌నపెడితే దీంతో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమా షూటింగుల్ని ఆప‌క‌పోవ‌డం కొంత ఉత్సాహం నింపుతోంది. అయితే చిన్న‌దో పెద్ద‌దో ఏదైనా సినిమా షూటింగ్ జ‌రిగితే చాలా మందికి ప‌ని దొరుకుతుంది కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితులు లేవన్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. సెట్స్ లో ఎవ‌రికో ఏదో కార‌ణంగా అనారోగ్యం రావ‌డం.. షూటింగ్స్ ఆపేడ‌యం స‌మ‌స్య‌గా మారింది.

ఇప్పుడు అలానే పాన్ ఇండియా మూవీ `పుష్ప` షూటింగ్ ని ఆపేశారు. సుకుమార్ కి వైర‌ల్ ఫీవ‌ర్ నాలుగు రోజులుగా ఇబ్బంది పెడుతోంది. ఈ సీజ‌న్ లో ఇది కామ‌న్ అయినా కీల‌క స‌మ‌యంలో ఈ ఇబ్బంది. దీంతో పుష్ప షూటింగ్ కి బ్రేక్ ప‌డింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌కుముందు బ‌న్ని స‌హా యూనిట్లో క‌రోనా సోక‌గా బ్రేక్ ప‌డ‌డం తీవ్ర ఇబ్బంది పెట్టింది. అల్లు శిరీష్ కూడా వెన్ను నొప్పి బాధ‌తో త‌న సినిమా `ప్రేమ కాదంట`కి బ్రేక్ చెప్పాడు. దీనివ‌ల్ల చిత్రీక‌ర‌ణ పెండింగ్ లో ఉంది.

త‌మిళ హీరో విశాల్ సినిమా కూడా బ్రేక్ ప‌డింది. విశాల్ కి సెట్స్ లో చిన్న యాక్సిడెంట్ అవ్వ‌డం కార‌ణంగా బ్యాక్ పెయిన్ తో ఈ సినిమా షూటింగ్ కి విరామం ఇచ్చారు. డార్లింగ్ ప్ర‌భాస్ కి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూళ్ల‌తో విశ్రాంతి స‌రిపోవ‌డం లేదు. ఆయ‌న‌ కూడా ఇంకా రాధేశ్యామ్ సెట్స్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. నిన్న‌నే ఇట‌లీ నుంచి వ‌చ్చి బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్రీక‌ర‌ణ‌లు వ‌డివడిగా సాగ‌డం లేదు. ప‌ని లేక‌పోతే కార్మికుల‌కే ఇబ్బంది. సెట్లో వంద‌లాది మందికి ఉపాధి ల‌భిస్తుంటే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో అదంతా సున్నా అయిపోయిన‌ట్టే. ఇది భ‌త్యానికి చాలా ఇబ్బందిక‌రం అని విశ్లేషిస్తున్నారు. అంతా స‌వ్యంగా సాగితేనే ఈ రంగంలో మ‌నుగ‌డ సాగుతుంది. కానీ అందుకు భిన్నంగా అష్ట‌క‌ష్టాలు ఎదుర్కోక త‌ప్ప‌డం లేదు.