Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: ఖ‌రీదైన కానుక‌లతో మురిపిస్తున్నారు!

By:  Tupaki Desk   |   25 Jun 2022 5:51 AM GMT
ట్రెండీ స్టోరి: ఖ‌రీదైన కానుక‌లతో మురిపిస్తున్నారు!
X
సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో గిఫ్ట్ (బ‌హుమ‌తు)ల ట్రెండ్ అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. స‌రైన‌ హిట్ కొడితే చాలు ఖ‌రీదైన కానుక‌లు అందుకుంటున్నారు. అయితే ఇది ప్రెస్టేజ్ కోసం పాకులాట అనే కంటే.. ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించేందుకు ఆలంబ‌న అనాలి.

బాలీవుడ్ కి చాన్నాళ్ల త‌ర్వాత అదిరిపోయే హిట్టిచ్చిన కార్తిక్ ఆర్యన్ మెక్ లారెన్ Gt కార్ ని అందుకున్నాడు. దేశంలో ఇదే మొట్ట‌మొద‌టి మెక్ లారెన్ కార్..భూల్ భుల‌యా 2 నిర్మాత భూష‌ణ్ కుమార్ ఈ గిఫ్ట్ ని ఇచ్చి స‌ర్ ప్రైజ్ చేసారు.

కార్తీక్ ఆర్య‌న్ తో పాటు 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనగరాజ్ లగ్జరీ కారును కానుక అందుకున్నాడు. కార్తీక్ -లోకేష్- సూర్య ఇంకా చాలా మంది బాలీవుడ్ సౌత్ ప్రముఖులు కొన్ని ఖరీదైన బహుమతులు అందుకున్నారు.

'భూల్ భూలయ్యా 2' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. దాదాపు 180 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఈ విజయానికి కానుక‌గా భూషణ్ కుమార్ కార్తిక్ ఆర్యన్ కు మెక్ లారెన్ జిటి కార్ ని బహుమతిగా ఇచ్చాడు. 4.5 కోట్ల ఖ‌రీదైన కార్ ని కానుకగా అందుకున్న కార్తీక్ చాలా ఆనందం వ్య‌క్తం చేసాడు. "చైనీస్ ఖానే కే లియే నయీ టేబుల్ గిఫ్ట్ మిల్ గయీ మెహనత్ కా ఫల్ మీతా హోతా హై సునా థా..ఇట్నా బడా హోగా నహీ పాట థా భారతదేశం యొక్క 1వ మెక్‌లారెన్ జిటి అగ్లా బహుమతి ప్రైవేట్ జెట్ సర్'' అని తెలిపాడు.

'విక్రమ్' సూపర్ సక్సెస్ తర్వాత కమల్ హాసన్ త‌న దర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ కి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. దానికి క‌మ‌ల్ హాసన్ కు లోకేష్‌ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. లోకేష్ కనగరాజ్ కి లగ్జరీ కారు మాత్రమే కాదు.. విక్రమ్ లో అతిథి పాత్రలో నటించిన సూర్యకి క‌మ‌ల్ హాసన్ రోలెక్స్ వాచ్ ను బహుమతిగా ఇచ్చాడు. సూర్య ట్వీట్ చేస్తూ- ''ఇలాంటి క్షణం జీవితాన్ని అందంగా చేస్తుంది! మీ #రోలెక్స్ కి ధన్యవాదాలు అన్నా'' అంటూ క‌మ‌ల్ పై ప్రేమ‌ను కురిపించారు.

గ‌తంలోకి వెళితే.. సల్మాన్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న‌డుమ స్నేహం గురించి తెలిసిన‌దే. మొదటిసారి ఈ జోడీ 'కిక్‌'లో కలిసి న‌టించారు. అందులో జాక్వెలిన్ నటనకు స‌ల్మాన్ ఎంతగానో ముగ్ధుడయ్యాడు. అతను ఆమెకు రూ. 2.50 కోట్లు ఖ‌రీదైన కార్ ని కానుకిచ్చాడు.

అమితాబ్ బచ్చన్ కోసం విధు వినోద్ చోప్రా బహుమతి ఇంత‌కుముందు చ‌ర్చ‌కు వ‌చ్చింది. విధు వినోద్ చోప్రా 'ఏకలవ్య'లో నటించడానికి అమితాబ్ బచ్చన్ నామ‌మాత్ర‌పు పారితోషికాన్ని కోరారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా స‌క్సెస‌వ్వ‌లేదు. అయినప్పటికీ విధు వినోద్ బిగ్ బికి రోల్స్ రాయిస్ ఫాంటమ్ ను బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ అమితాబ్ కోసం ఈ కారును విక్రయించినట్లు వార్తలు వచ్చాయి.

ఇంత‌కుముందు కేజీఎఫ్ స‌క్సెస్ సాధించిన క్ర‌మంలో ప్ర‌శాంత్ నీల్ కి రాకింగ్ స్టార్ య‌ష్ ఖ‌రీదైన ఫోన్ ని కానుక‌గా ఇచ్చాడు. ల‌క్ష‌ల్లో దీని విలువ ఉంటుంది. అలాగే ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే త‌న టెక్నీషియ‌న్లంద‌రినీ ఇంటికి పిలిపించుకుని మ‌రీ రామ్ చ‌ర‌ణ్ బంగారు నాణేల‌ను కానుక‌గా ఇచ్చారు. వీటి విలువ ల‌క్ష‌ల్లో ఉంది. ఇక చ‌ర‌ణ్ చాలా సార్లు త‌న తండ్రి గారైన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన కార్ ల‌ను కానుక‌గా ఇచ్చారు. చెర్రీ కూడా చిరు నుంచి అందుకున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కి బండ్ల గ‌ణేష్ కానుక‌ల గురించి తెలిసిందే. టాలీవుడ్ హీరోల్లో ప‌లువురు త‌మ ద‌ర్శ‌కుల‌కు ఖ‌రీదైన కార్ ల‌ను కానుక‌లుగా ఇచ్చిన సంద‌ర్భాలు అనేకం.