Begin typing your search above and press return to search.

'పుష్ప' కోసం ట్రెండీ సింగర్‌

By:  Tupaki Desk   |   25 Sep 2021 12:30 AM GMT
పుష్ప కోసం ట్రెండీ సింగర్‌
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈయన ఇప్పటికే మొదటి పాటను విడుదల చేశాడు. మాస్ మసాలా సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ రెండవ పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. రెండవ పాట మాస్ గా కాకుండా మెలోడీగా ఉంటుందని అంటున్నారు. సుకుమార్ మరియు దేవి శ్రీ ప్రసాద్‌ ల కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మంచి మ్యూజికల్‌ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు పుష్ప కూడా ఖచ్చితంగా మ్యూజికల్‌ హిట్‌ గా నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్‌ లో పుష్ప తో మరోసారి సుకుమార్‌ దేవిశ్రీలు సెన్షేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని మొదటి సాంగ్‌ తోనే తేలిపోయింది. అతి త్వరలో రెండవ పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈమద్య కాలంలో ట్రెండ్‌ అవుతున్న పాటల్లో ఎక్కువ శాతం పాడింది సిద్ద్‌ శ్రీరామ్‌. అతడు బన్నీ గత చిత్రం అల వైకుంఠపురంలో పాడిన పాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే సెంటిమెంట్‌ తో పుష్ప పార్ట్‌ 1 లో కూడా అతడితో పాడించాలని భావిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే అతడితో ట్రావెల్ అవుతున్నాడట. పుష్ప కోసం సిద్ద్‌ తో ఒక అద్బుతమైన మెలోడీని దేవి శ్రీ ప్రసాద్ పాడించాడని.. ఇద్దరి కాంబోలో రాబోతున్న ఈ మెలోడీ మరో లెవల్‌ లో ఉంటుందని అంటున్నారు. సామజవరగమనా.. పాటను మించిన మెలోడీ అన్నట్లుగా పుష్ప లో సిద్‌ పాడబోతున్న పాట ఉంటుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. దసరా లేదా కాస్త ముందుగానే పుష్ప నుండి రెండవ పాట విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సుకుమార్‌ ఈ సినిమా ను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప పార్ట్‌ 1 ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. మొదటి పాటను అయిదు భాషలకు అయిదుగుర సింగర్స్ ను తీసుకున్నారు. మరి రెండవ మెలోడీ సాంగ్‌ ను సిద్‌ తోనే అన్ని భాషల్లో పాడిస్తారా లేదంటే దాన్ని కూడా అయిదుగురు సింగర్స్ తో పాడిస్తారా అనేది చూడాలి. భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప రెండవ సాంగ్‌ కు సంబంధించిన అప్ డేట్ అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మేకర్స్ అనఫిషియల్‌ గా సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు. కనుక కన్ఫర్మ్‌ గా పుష్ప రెండవ పాటను పాడబోతున్నది సిద్‌ అని మీడియా వర్గాల వారు చెబుతున్నారు.