Begin typing your search above and press return to search.

#ట్రెండింగ్‌.. మహేష్ తో తమన్నా మ‌రోసారీ...!

By:  Tupaki Desk   |   7 March 2021 1:30 AM GMT
#ట్రెండింగ్‌.. మహేష్ తో తమన్నా మ‌రోసారీ...!
X
ఆగ‌డు లో క‌థానాయిక‌గా న‌టించిన త‌మ‌న్నా ఆ త‌ర్వాత మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలోనూ ఓ స్పెష‌ల్ నంబ‌ర్ లో మెరుపులు మెరిపించింది. ఇప్పుడు మ‌రోసారి మిల్కీ మ‌హేష్ స‌ర‌స‌న జాక్ పాట్ కొట్టిందా? అంటే.. అవున‌నే స‌మాచారం.

అయితే ఈసారి క‌థే వేరు. ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు. అయితే ఇది సినిమా కోసం కాదు. టీవీ ప్ర‌క‌ట‌న కోసం. మహేష్ - తమన్నా ఒక పాపుల‌ర్ ప‌రుపుల కంపెనీకి ప్ర‌చారం చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. ప్ర‌క‌ట‌న‌లో త‌మ‌న్నా లుక్ కాస్త డిఫ‌రెంట్ గానే క‌నిపిస్తుంద‌ట‌. ఓవైపు మ‌హేష్ స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉండ‌గానే ఈ ప్ర‌క‌ట‌న‌ను గ్యాప్ లో తెర‌కెక్కిస్తున్నారు. సీటీమార్- అంధధున్ తెలుగు రీమేక్ ‌లో త‌మ‌న్నా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ప‌రంగా మ‌హేష్ .. త‌మ‌న్నా ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నారు. శీతల పానీయాలు స‌హా రియల్ ఎస్టేట్ కంపెనీలు.. ఇ-కామర్స్ సంస్థలు.. కార్ సెర్చ్ ఇలా ఎన్నిటికో మ‌హేష్ బ్రాండ్ అంబాసిడ‌ర్. ఏఎంబీ సినిమాస్ కి ఆయ‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నారు. త‌మ‌న్నా ప్ర‌ముఖ బ్రాండెడ్ స్టోర్స్ కి ప్ర‌చారం చేస్తున్నారు.