ట్రైలర్ టాక్: దిశ హత్యాచారం ఎన్ కౌంటర్ `దించేశారు`!

Sat Sep 26 2020 12:15:57 GMT+0530 (IST)

Trailer Talk RGV Realistic Take On Brutal Disha Incident

హైదరాబాద్ రాజధాని ఔటర్ రింగ్ రోడ్ లో ఘోర ఆకృత్యాన్ని ప్రపంచం అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఒక వైద్యవిద్యార్థినిని ట్రాప్ చేసి ఎత్తుకెళ్లిన కొందరు దుర్మార్గులు అత్యాచారం చేసి ఔటర్ ఫ్లైవోవనర్ కింద దారుణంగా తగులబెట్టారు. ఆ తర్వాత దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవ్వడం హంతకుల్ని వదిలిపెట్టమని పోలీసులు వార్నింగులు ఇవ్వడం .. చెప్పినట్టే హత్యాచారానికి పాల్పడిన మృగాల్ని వెంటాడి వేటాడి ఎన్ కౌంటర్ చేసిన మొత్తం ఎపిసోడ్ సంచలనమే అయ్యింది.26 నవంబర్ 2019న నలుగురు అగంతకుల హత్యాచారానికి సంబంధించిన రియల్ ఘటనపై సినిమా తీస్తున్నామని ఆర్జీవీ ఆనాడే ప్రకటించారు. స్క్రిప్టు పై చాలా గ్రౌండ్ వర్క్ చేసారు. అలాగే దిశ ఘటన కారకుల ఇండ్లకు వెళ్లి మరీ రకరకాల విషయాలపై ఆరాలు తీసారు ఆర్జీవీ. `దిశ- ఎన్ కౌంటర్` పేరుతో ఇప్పుడు సినిమాని సిద్ధం చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం కళ్లకు కట్టినట్టు ఆ ఘటనను ఎంతో రియలిస్టిక్ గా విజువలైజ్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. రోడ్ పక్కన స్కూటీ పార్క్ చేసిన అమ్మాయిని పక్కనే ఉన్న లారీ క్లీనర్లు మాస్ బాబులు అంత రద్దీ రోడ్ లోనూ ఎంతో ఘోరంగా ట్రాప్ చేసి తుప్పల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి.. అటుపై అదే లారీలో తీసుకెళ్లి తూము కింద వేసి పెట్రోల్ వేసి తగులబెట్టిన ఘటన అనంతరం పోలీసుల ఎన్ కౌంటర్ (సౌండింగ్ ప్రూఫ్ తో)  ఆద్యంతం విజువలైజేషన్ పరంగా అచ్చంగా ఇలానే జరిగిందా? అన్నంత క్లారిటీతో చూపించిన తీరును మెచ్చుకుని తీరాలి.

ఔటర్ లో నిత్యం రద్దీ ఉంటుంది. ఎవరి పనిలో వాళ్లు వెళ్లిపోతుంటారు. వాహనాలు సర్రున దూసుకెళ్లిపోతుంటాయి. అలాంటప్పుడు పరిసరాల్లో ఏం జరుగుతుందో పట్టించుకునేంత సమయం ఉండనే ఉండదు. ఆ విషయాన్ని కూడా అర్థమయ్యేలా ఎంతో అందంగా చూపించారు ఈ ట్రైలర్ లో. ఇక ట్రైలర్ లో ఉన్నంత గ్రిప్ సినిమాలో ఉంటే బొమ్మ బంపర్ హిట్టే. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఆర్జీవీ ప్రచార సారథిగా.. నట్టి క్రాంతి & నట్టి కరుణ నిర్మిస్తున్నారు.  శ్రీకాంత్ అయ్యంగార్- సోనియా అకులా- ప్రవీణ్ రాజ్ తదితరులు నటించారు. D. S. R. సంగీతం అందించారు. జగదీష్ చెకాటి- కళ్యాణ్ సామి ఛాయాగ్రహణం అందించారు.  అనురాగ్ కాంచార్ల ప్రొడక్షన్స్ లో నాటిస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.