దేవరకొండ మళ్లీ ఆ ఫీట్ సాధిస్తాడా?

Sat Aug 18 2018 07:00:11 GMT+0530 (IST)

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘గీత గోవిందం’ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బౌండరీల అవతల కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. కర్ణాటక.. తమిళనాడుల్లో ఈ చిత్రం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజిలో వసూళ్లు రాబట్టింది. ఇక అమెరికా సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రిమియర్లతోనే 4 లక్షల డాలర్లు వసూలయ్యాయి. మరుసటి రోజు మిడ్ వీకెండ్లోనూ ఈ చిత్రంలో మంచి వసూళ్లే రాబట్టింది. శుక్రవారం షోలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 8 లక్షల డాలర్ల మార్కును దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. శని.. ఆది వారాల్లో ‘గీత గోవిందం’ భారీగా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. శనివారమే మిలియన్ మార్కును దాటేసి.. వీకెండ్ అయ్యేసరికి 1.3 మిలియన్ మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం 2 మిలియన్ మార్కును అందుకోవడం పక్కాగా కనిపిస్తోంది.హీరోగా విజయ్ తొలి సినిమా ‘పెళ్లిచూపులు’ అప్పట్లో సంచలన వసూళ్లు సాధించింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై 1.5 మిలియన్ మార్కుకు చేరువగా వెళ్లింది. ఇక గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ ప్రభంజనం గురించి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా 2 మిలియన్ మార్కునే దాటేసింది. అదే పీట్‌ను ‘గీత గోవిందం’ ఈజీగా అందుకునేలా ఉంది. వచ్చే వారం రాబోతున్న ‘నీవెవరో’.. ‘ఆటగాళ్ళు’ సినిమాల నుంచి ‘గీత గోవిందం’కు పెద్ద ప్రమాదమేమీ లేకపోవచ్చు. నెలాఖర్లో ‘నర్తనశాల’.. ‘శైలజారెడ్డి అల్లుడు’ వచ్చే వరకు దీనికి ఢోకా లేకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా బయ్యర్లు వీకెండ్ లోపే లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం నాటికి ఈ చిత్రం రూ.25 కోట్ల షేర్ మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.