ఇంట్రెస్టింగ్: ఇద్దరు మల్లూ భామల మధ్య తీవ్ర పోటీ..!

Thu Jun 10 2021 17:00:01 GMT+0530 (IST)

Tough Fight Between Two Kerala Beauties

టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఒకే ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరి ముద్దుగుమ్మల పేర్లు కూడా కలవడం ఇక్కడ విశేషం. వాళ్ళెవరో కాదు మలయాళీ బ్యూటీస్ అను ఇమ్మాన్యుయేల్ - అనుపమ పరమేశ్వరన్.'అ ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన 'ప్రేమమ్' బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. యంగ్ హీరోలతో జతకడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక 'మజ్ను' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్.. స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశం అందుకుంది. అయితే ప్రస్తుతం వీరిద్దరి కెరీర్ బడ్డింగ్ స్టేజ్ లో ఉంది.

సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరు అను బేబీలు.. ప్రస్తుతం చెరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక్కడ యాదృఛికం ఏంటంటే ఇద్దరూ ఒకే బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు. అవి కూడా వైవిధ్యమైన లవ్ స్టోరీలే కావడం గమనార్హం. అవే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 'ప్రేమ కాదంట' - '18 పేజెస్' చిత్రాలు.

యువ హీరో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ''ప్రేమ కాదంట''. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. నిఖిల్ సిద్దార్థ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న చిత్రం ''18 పేజెస్''. పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రీసెంటుగా వచ్చింది.

అయితే ఈ రెండు సినిమాలు కూడా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్నాయి. రెండింటికీ బన్నీ వాస్ నిర్మాతగా  వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మరో విషయమేంటంటే.. ఇద్దరు అను బ్యూటీస్ పక్కన నటిస్తున్న శిరీష్ - నిఖిల్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇలా మలయాళ ముద్దుగుమ్మలు అను ఇమ్మాన్యుయేల్ - అనుపమ పరమేశ్వరన్ లు చేస్తున్న రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి.