స్టార్ హీరో కజిన్ తో అగ్ర హీరోయిన్ పెళ్లి?

Sat Nov 27 2021 17:00:01 GMT+0530 (IST)

Top heroine marries star hero cousin

వరుసగా బ్యాండ్ భాజాలు మోగుతున్నాయ్! సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో పెళ్లి భాజాలు హాట్ టాపిక్. బాలీవుడ్ లోనూ మోతెక్కిపోతోంది. పెళ్లిల్లు వేడెక్కిస్తున్నాయి. ఇటీవలే అనుష్క రాంజాన్ - ఆదిత్య సీల్ జంట పెళ్లితో ఒకటైంది. రాజ్‌కుమార్ రావు- పత్రలేఖ రీసెంట్ గానే వివాహం చేసుకున్నారు. విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ (విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ వెడ్డింగ్) వివాహానికి సమయం సమీపిస్తోంది.డిసెంబర్ 9న జరగనున్న ఈ వేడుకకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఊహించని వార్తలు వచ్చాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు సోనాక్షి సిన్హా పేరు చేరింది. తాజా గుసగుసల ప్రకారం సోనాక్షి సిన్హా కూడా త్వరలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ అగ్ర నాయిక సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యుడితో డేటింగ్ చేస్తోందని సమాచారం. అతనితో సోనాక్షి సిన్హా పలు వేడుకల్లో ప్రత్యక్షమైంది. అతడి పేరు బంటీ సచ్‌దేవ్. సల్మాన్ కుటుంబానికి చెందిన ప్రముఖుడు. సోనాక్షి బంటీతో లాక్ అయ్యిందని గుసగుస వినిపిస్తోంది.

ఇంతకీ ఎవరీ బంటీ అంటే.. సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ కి బావ అని తెలుస్తోంది. సోనాక్షి - బంటీ తరచుగా పలు వేడుకలు సమావేశాలలో కలిసి కనిపించారు. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి చెప్పిన సంగతి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

``నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఒక కుర్రాడితో ప్రేమలో పడ్డాను. అయితే నేను నా డిప్లొమా పూర్తయిన వెంటనే మా సంబంధాన్ని ముగించాను`` అని తెలిపింది. ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ కనెక్షన్ ని నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను.. అని కూడా వ్యాఖ్యానించింది.

ఆసక్తికరంగా ఇంతకీ ఐదేళ్ల ప్రేమాయణంలో ఆ కుర్రాడెవరు? అని ఆరా తీస్తే అతడు బంటీ సచ్ దేవ్ అట. ఆ స్నేహం కారణంగానే సోనాక్షి సిన్హా - బంటీ సచ్ దేవ్ అత్యంత సన్నిహితంగా చాలా సందర్భాలలో పార్టీలలో కలిసి కనిపించారు. ఇప్పుడు వారి పెళ్లి వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే సోనాక్షి లేదా బంటీ లేదా ఇరు కుటుంబాల నుంచి అధికారికంగా పెళ్లికి సంబంధించిన వివరం వెల్లడి కావాల్సి ఉంటుంది.

సల్మాన్ వరుడు అనుకుంటే..!

నిజానికి సోనాక్షి సిన్హా సల్మాన్ సరసన దబాంగ్ ఫ్రాంఛైజీలో నటించాక అతడినే పెళ్లాడుతుందని కూడా అభిమానులు భావించారు. కానీ అది నిజం కాలేదు. సల్మాన్ తనకు పరిశ్రమలో మెంటార్ గా మాత్రమే కొనసాగారు. షాట్ గన్ శత్రుఘ్న సిన్హా సన్నిహితుడిగా వీర విధేయుడిగా సల్మాన్ చాలా బ్యాలెన్స్ డ్ గా వ్యవహరించారు.

ఓ ఇన్ స్టా లింక్ వేదికగా సల్మాన్ - సోనాక్షి పెళ్లి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. వీళ్లకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందో ఫోటోలు కూడా క్రియేట్ చేయడం బిగ్ కామెడీ. తాజా అప్ డేట్ ప్రకారం సోనాక్షి ఎప్పటికీ సల్మాన్ ని పెళ్లాడే వీల్లేదు. షాట్ గన్ వారసురాలికి వరుడు ఫిక్సయినట్టేనని భావిస్తున్నారు.