Begin typing your search above and press return to search.

OTT కి చెక్ పెట్టే ప్లాన్ లో అగ్ర బ్యాన‌ర్లు?

By:  Tupaki Desk   |   11 May 2021 4:40 AM GMT
OTT కి చెక్ పెట్టే ప్లాన్ లో అగ్ర బ్యాన‌ర్లు?
X
క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల్ల థియేటర్లు మరోసారి మూసివేశారు. చాలామంది నిర్మాత‌లు త‌మ సినిమాల్ని ఇలాంటి క్రైసిస్ లో హాల్స్ లో రిలీజ్ చేసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డం.. ప్రేక్ష‌కుల నిస్స‌హాయ స్థితి చూశాక‌ థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. దీంతో చాలామంది నిర్మాత‌లు త‌మ‌ దృష్టిని OTTల వైపు మర‌ల్చారు. మొద‌టి వేవ్ లో చాలా సినిమాలు OTT లో విడుదలయ్యాయి. సెకండ్ వేవ్ లోనూ అలాంటి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో చాలా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంది.

అయితే నిర్మాత‌లు అడుగుతున్న మొత్తాల్ని ఇచ్చేందుకు ఓటీటీలు సిద్ధంగా లేవు. కొన్ని బ‌డా OTT వేదిక‌లు మరోసారి మంచి ఆఫర్ లతో పెద్ద సినిమాల్ని కొనేందుకు ఆసక్తిగా ఉన్నా కానీ... మీడియం-బడ్జెట్ చిత్రాలకు బ‌డ్జెట్ల‌ను పూర్తిగా కుదించేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల OTT లో చిన్న‌ సినిమాలు చూసిన చాలా మంది ప్రేక్ష‌కులు ఇంత పెద్ద డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని భావించారనే వాద‌న తెర‌పైకొచ్చింది. అందుకే ఓటీటీ ప్ర‌తినిధులు తక్కువ ధరలతో నిర్మాత‌ల్ని సంప్రదిస్తున్నారు. ఇది చాలా మంది నిర్మాతలకు న‌చ్చ‌డం లేదు. పరిశ్రమలో చర్చ ప్ర‌కారం.. పాపుల‌ర్ బ్యానర్లు ఈ త‌ర‌హా OTT ఒప్పందాలను నిర్ధ‌య‌గా తిరస్కరిస్తున్నాయి.