Begin typing your search above and press return to search.

టాప్‌ స్టార్లు.. బాల‌ల దినోత్స‌వ కానుక‌లు

By:  Tupaki Desk   |   13 Nov 2019 11:13 AM GMT
టాప్‌ స్టార్లు.. బాల‌ల దినోత్స‌వ కానుక‌లు
X
ఈసారి న‌వంబ‌ర్ 14న‌ బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకుని మ‌న స్టార్లు ఎలాంటి గిఫ్ట్స్ రెడీ చేస్తున్నారు? అంటే .. ఓ ఇద్ద‌రి నుంచి అదిరిపోయే కానుక‌లు ఆశించ‌వ‌చ్చు. ఎవ‌రా ఇద్ద‌రు? అంటే స్టార్ హీరోలు అల్లు అర్జున్.. కింగ్ నాగార్జున నుంచి కానుక‌లు అంద‌నున్నాయ‌ట‌.

ఇంత‌కీ ఎలాంటి కానుక‌లు అంటే.. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 'అల వైకుంఠ‌పుర‌ములో' చిత్రం నుంచి 'ఓ మైగాడ్ డాడీ..' అంటూ సాగే సాంగ్ టీజ‌ర్ రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌- రాములో రాముల చార్ట్ బ‌స్ట‌ర్ లో నిల‌వడంతో ఈ మూడో పాట‌ను ఆ రేంజులోనే ఎక్కించే ముందు టీజ‌ర్ ప్లాన్ లో ఉంది థ‌మ‌న్ బృందం. అయితే దీనిని అధికారికంగా ప్ర‌క‌టించే ముందే అల్లు అర్జున్ ట్వీట్ చేసి డిలీట్ చేయ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ టీజ‌ర్ గురువారం 4పీఎం రిలీజ్ చేయ‌నున్నార‌న్న స‌మాచారం లీకైంది కాబ‌ట్టి అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది.

ఇక ప‌నిలో ప‌నిగా గురువారం నాడు అక్కినేని ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్ కి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసేందుకు అక్కినేని నాగార్జున - క‌ళాబంధు టీఎస్సార్ బృందం రెడీ అవుతున్నారు. ఏఎన్నార్ నేష‌న‌ల్ అవార్డ్ 2018-19 ఎవ‌రికి అన్న‌ది అన్న పూర్ణ స్టూడియోస్ ప్రాంగ‌ణంలో ప్ర‌క‌టించ‌నున్నారు. అమితాబ్-బాల‌చంద‌ర్- కృష్ణ‌- శ్రీ‌దేవి ఇంత‌కుముందు ఈ పుర‌స్కారం ద‌క్కించుకున్నారు. 2017 సంవ‌త్స‌రానికి గాను ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఈ గౌర‌వాన్ని అందుకున్నారు. మ‌రి ఈసారి ఎవ‌రికి అన్న‌ది వేచి చూడాల్సిందే.