Begin typing your search above and press return to search.

అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడి దారుణ వైఫ‌ల్యం!

By:  Tupaki Desk   |   7 March 2021 2:30 AM GMT
అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడి దారుణ వైఫ‌ల్యం!
X
కొత్త‌వాళ్లును ప్రోత్స‌హిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు అన్నంత ప‌నీ చేస్తున్నారు ఆ అగ్ర నిర్మాత కం పంపిణీదారు. నేటిత‌రం నిర్మాత‌లు తెర‌కెక్కించినా ఏదైనా సినిమాలో కంటెంట్ బావుంది అంటే స‌ద‌రు అగ్ర నిర్మాత‌ వాటిని ఎంక‌రేజ్ చేస్తూ థియేట‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాయం చేస్తున్నారు. తన‌ పేరుతో వాటిని రిలీజ్ చేస్తున్నారు. ఆ కోవ‌లోనే ఓ ప్ర‌ముఖ టీవీనటుడితో ఓ కొత్త నిర్మాత తీసిన సినిమాని ఎంక‌రేజ్ చేశారు ఆ అగ్ర నిర్మాత‌.

ఈ శుక్ర‌వారం ఆ సినిమా మ‌రో డ‌జ‌ను సినిమాల‌తో పోటీప‌డుతూ రిలీజైంది. కానీ ఏం లాభం? ఆశించిన కంటెంట్ లేక‌పోవ‌డంతో సినిమా ఫ్లాప్ అన్న టాక్ వ‌చ్చేసింది. ప్ర‌చారానికి కూడా స‌రిగా ఖ‌ర్చు చేయ‌క‌పోవ‌డం మినిమం టాక్ లేక‌పోవ‌డంతో అంతంత మాత్రంగా ఉన్న సినిమా కూడా కిల్ అయిపోయింది.

అస‌లు అంత స్ట‌ఫ్ లేని సినిమాని ఆయ‌న ఎందుక‌ని నెత్తిన వేసుకున్నారు? అంటూ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌ సాగుతోంది ఇప్పుడు. అప్పుడ‌ప్పుడు కొత్త‌వారికి ప్రోత్సాహం అంటూ ఇలాంటివి చేస్తుంటారు. ఏదో పేరు వేసుకుంటారంతే ! అంటూ గుస‌గుసా వేడెక్కిస్తోంది. అయితే ఇలాంటివి వేసేప్పుడు హిట్లు తేక‌పోతే మార్కెట్లో బ్యాడ్ అయిపోతుంది ఇమేజ్. అలాగే శాటిలైట్ డిజిట‌ల్ మార్కెట్ ప‌రంగానూ దెబ్బ‌యిపోవ‌డం ఖాయం.

దానికంటే ఏదైనా సినిమాని క‌చ్ఛిత‌మైన అంచ‌నాతో రిలీజ్ చేస్తే బావుంటుందేమోన‌న్న గుస‌గుసా వేడెక్కిస్తోంది. ట్రైల‌ర్ తో కంటెంట్ తో మెప్పించ‌లేని సినిమాల్ని రిలీజ్ చేసే యోచ‌న మానుకుంటేనే బెట‌ర్ క‌దా? అన్న అభిప్రాయాలు కూడా ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఆ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు కం ఎగ్జిబిట‌ర్ దీనికి అంగీక‌రిస్తారా లేదా.. చూడాలి.