Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : విధిరాత నుంచి విష్ణుమూర్తి కూడా త‌ప్పించుకోలేడా..!

By:  Tupaki Desk   |   3 Dec 2022 9:35 AM GMT
టీజ‌ర్ టాక్ : విధిరాత నుంచి విష్ణుమూర్తి కూడా త‌ప్పించుకోలేడా..!
X
స‌క్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వ‌రుస‌ విభిన్న‌మైన సినిమాల్లో న‌టిస్తూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు యంగ్ హీరో ఆది సాయికుమార్. త‌న‌ న‌టిస్తున్నలేటెస్ట్ మూవీ 'టాప్ గేర్‌'. రియా సుమ‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని కె. శ‌శికాంత్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌ధ‌న‌ల‌క్ష్మీ ప్రొడ‌క్ష‌న్స్‌, ఆదిత్య మూవీస్‌, అండ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కె.వి. శ్రీ‌ధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 30న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేసింది.

ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఆ త‌రువాత సిధ్ శ్రీ‌రామ్ పాడిన 'వెన్నెల పాట‌' ప్ర‌స్తుతం నెట్టింట ట్రెండ్ అవుతూ సినిమాపై మంచి బ‌జ్ ని క్రియేట్ చేసింది. ఇదిలా వుంటే తాజాగా శ‌నివారం ఈ మూవీ టీజ‌ర్ ని ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల చేశారు.

ఆత్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ టీజ‌ర్ ఆస‌క్తినిరేకెత్తిస్తూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ద‌ర్శ‌కుడు మారుతి రిలీజ్ చేసిన టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. సినిమాలో హీరో ఆది సాయికుమార్ టాక్సీ న‌డిపై వ్య‌క్తిగా క‌నిపించ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.

గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ‌గానే ఎల్లో ట్యాక్సీ వెళుతున్న దృశ్యాల‌తో ఒక నిమిషం 20 సెకండ్ల నిడివితో టీజ‌ర్ మొద‌లైంది. వెంట‌నే ఫోన్ రింగ్ కావ‌డం.. ఆది లిఫ్ట్ చేయ‌డంతో ...విధి రాత‌నుంచి విష్ణు మూర్తి కూడా త‌ప్పించుకోలేక‌పోయాడు అన్న‌ది ఎంత నిజ‌మో.. నా నుంచి నువ్వు త‌ప్పించుకోలేవ‌న్న‌ది కూడా అంతే నిజం.. ఇప్ప‌డు రెండు ప్రాణాలు పోతాయ్‌..' అంటూ ఓ వాయిస్ ఆదిని బెదిరించ‌డం.. కార్ ముందుకు సాగుతున్న క్ర‌మంలో వైప‌ర్స్ క‌దులుతున్న క్ర‌మంలో సినిమాలో వున్న ప్ర‌ధాన పాత్ర‌ల‌ని చూపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

అంతే కాకుండా వాయిస్ ఆగిన మ‌రుక్ష‌ణ‌మే గ‌న్ తో ఓ వ్య‌క్తి ఆదిని బెదిరించ‌డం.. త‌న‌ని వెంబ‌డిస్తున్న వారి నుంచి త‌ప్పించుకుంటూ ఆది కారులో ప్ర‌యాణిస్తున్న తీరు.. ఫైన‌ల్ గా ఆది ప్ర‌యాణిస్తున్న కార్ ని పోలీసులు వెంబ‌డించడం.. వెర‌సి 'టాప్ గేర్' టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 'అర్జున్ రెడ్డి' మూవీకి నేప‌థ్య సంగీతం అందించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ అందించిన నేప‌థ్య సంగీతం, సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌ధాన హైలైట్స్ గా నిలిచి సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి.

స‌రికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రిలీజ్ కానున్న ఈ మూవీతో ఆది సాయి కుమార్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకునేలా వున్నాడు. ఈ మూవీలో ఆది సాయికుమార్ కు జోడీగా రియా సుమ‌న్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో బ్ర‌హ్మాజీ, స‌త్యం రాజేష్‌, మైమ్ గోపీ, న‌ర్రా, శ‌త్రు, బెన‌ర్జి, చ‌మ్మ‌క్ చంద్ర‌, రేడియో మిర్చి హేమంత్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.