రేపే 'గంగూ బాయి' టీజర్.. సెక్స్ వర్కర్ గా అలియాభట్.. ఎలా ఉంటుందో..?

Tue Feb 23 2021 23:00:02 GMT+0530 (IST)

Tomorrow 'Gangu Bai' teaser Aliabhat as a sex worker

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ 'గంగూ బాయి కతియావాడి'. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. ముంబైలోని సెక్స్ వర్కర్స్ ప్రాంతమైన కామాటిపురలో బ్రోతల్ హౌస్ రన్ చేసిన ప్రముఖ సెక్స్ వర్కర్ 'గంగూ బాయి కతియావాడి' జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.హుస్సేన్ జైదీ రచించిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై'లోని 'మేడమ్ ఆఫ్ కామాటిపుర' నుంచి వివరాలు తీసుకున్నారు. ఆ పుస్తకం ప్రకారం.. 1960వ దశకంలో తన ప్రియుడితో గుజరాత్ నుంచి ముంబై పారిపోయి వచ్చిన గంగూ బాయిని.. ఆమె ప్రియుడు మోసం చేస్తాడు. సినిమాల్లో మాదిరిగా ఆమెను వేశ్యాగృహానికి అమ్మేస్తాడు. ఆ తర్వాత అక్కడినుంచి బయట పడలేకపోయిన గంగూబాయి.. ఆ తర్వాత తానే వేశ్యాగృహాలను నడిపే స్థాయికి చేరుకుంటుంది.

అలియాభట్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. గంగూ బాయి క్యారెక్టర్ ను ఛాలెంజింగ్ గా తీసుకొని నటిస్తోంది అలియా. ఈ మూవీ టీజర్ రేపు రిలీజ్ చేయబోతోంది యూనిట్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రంలో అలియా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందోనని టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ మూవీలో అలియా భట్ 16 ఏళ్ల అమ్మాయి నుండి 60 సంవత్సరాల వృద్ధురాలిగా మారేంత వరకు పలు దశల్లో కనిపించనుంది. ఇందుకోసం హెవీ డ్యూటీ మేకప్ తోపాటు వీఎఫ్‌ఎక్స్ కూడా ఉపయోగిస్తున్నారు. మరి దర్శకుడు ఈ టీజర్ ను ఎలా కట్ చేశారు? అది ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? అన్నది చూడాలి.