బావుందండీ.. టామ్ క్రూజ్ ఫోన్ కాల్ చేస్తాడేమో!

Mon Jul 04 2022 07:00:01 GMT+0530 (IST)

Tom Cruise Receives Birthday Wishes From Team Happy Birthday

కొన్నిసార్లు ప్రమోషన్స్ వర్కవుటైతే అందులో ఫన్నీ ఎలిమెంట్స్ జనానికి కనెక్టయితే దానికి తగ్గట్టే ఓపెనింగులు రప్పించే వీలుంటుంది. అప్పట్లో జాతిరత్నాలు సినిమాకి .. బ్రోచేవారెవరురా చిత్రానికి ఇలాంటివి కలిసొచ్చాయి. పరిమిత బడ్జెట్ లో వచ్చిన ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు అదే కోవలో అందరూ కమెడియన్లతో తెరకెక్కించిన `హ్యాపీ బర్త్ డే` ప్రమోషన్స్ కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. `హ్యాపీ బర్త్ డే` జూలై 8న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రితేష్ రానా దర్శకత్వం వహించిన సర్రియల్ కామెడీ మూవీ ప్రమోషన్స్ ని ఇటీవల ప్రారంభించారు.మిగతా సినిమాలకు భిన్నంగా హ్యాపీ బర్త్ డే అంటూ గత కొన్ని రోజులుగా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అది ఫేక్ టీవీ ఛానెల్ డిబేట్ అయినా లేదా స్నీక్ పీక్ ప్రాంక్ అయినా టీమ్ హ్యాపీ బర్త్ డేని ఎంతో యూనిక్ గా ప్రచారం చేస్తోంది.

ఈరోజు హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ `హ్యాపీ బర్త్ డే` తెలిపిన విధానం ఆకట్టుకుంది. టామ్ క్రూజ్ స్టాండింగ్ ఫోటోతో పాటు హ్యాపీ బర్త్ డే నటీనటుల ఫోటోలతో కూడిన ప్రత్యేక ఫ్లెక్సీని డిజైన్ చేశారు. ట్వీట్ లో `అన్నా` అని కూడా వేశారు. మొత్తానికి కామెడీ ఎంటర్ టైనర్ లో ఫన్ ఎలిమెంట్ కి తగ్గట్టే క్రియేటివిటీతో కూడుకున్న ప్రమోషనల్ స్టంట్ నెటిజనులకు బాగా నచ్చింది. దీనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సత్య- వెన్నెల కిషోర్- నరేష్ అగస్త్య- సుదర్శన్- రోహిణి- గెటప్ శీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి లావణ్య త్రిపాఠి గ్లామర్ ప్రధాన అస్సెట్ కానుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.

ఇటీవలే టాప్ గన్ చిత్రంతో 1 బిలియన్ డాలర్ క్లబ్ లో చేరాడు టామ్ క్రూజ్. అతడికి ఇలా విష్ చేయడం సబబుగానే ఉంది. లావణ్య త్రిపాఠి అండ్ టీమ్ కి  టామ్ క్రూజ్ ఫోన్ కాల్ చేస్తాడేమో! అనేదే డౌట్.