#క్లోజ్ సోర్స్.. మేలో టాలీవుడ్ యువహీరో రెండో పెళ్లి?

Sun Mar 07 2021 10:00:01 GMT+0530 (IST)

Tollywood young hero's second wedding in May?

2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యువహీరో మనస్పర్థల కారణంగా విడిపోవడం.. అటుపై కెరీర్ పరంగా డైలమా గురించి సంగతి తెలిసిందే. ఇటీవల విడాకులు మంజూరవ్వడంతో ఇప్పుడు సదరు యువహీరో రెండో పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారమవుతోంది.అయితే దీనిపై ఆ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అతడు ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నారని తననే పెళ్లాడనున్నాడని కూడా ఇటీవల ప్రచారం సాగినా అవేవీ నిజం కాదని తెలిసింది. తమ కుటుంబానికి దగ్గరగా ఉండే అమ్మాయినే ఆ యంగ్ హీరో పెళ్లాడనున్నారట. 2021 మేలో ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన వెలువడనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అతడు పెళ్లాడబోయే యువతి ఎవరు? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సొంత బ్యానర్ ప్రారంభించి కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న ఆ యువహీరో తదుపరి కెరీర్ పరంగా ప్లాన్ తో ఉన్నారని తెలుస్తోంది.