ప్లాప్ డైరెక్టర్ తో తెలుగు లో అమెజాన్ ప్రైమ్...

Tue Jun 28 2022 13:00:45 GMT+0530 (IST)

Tollywood webseries on amazon primevideos

ఇండియా లో ఓటీటీ మార్కెట్ గత మూడు సంవత్సరాల్లో అనూహ్యంగా పెరిగింది. థియేట్రికల్ స్క్రీనింగ్ కంటే కూడా అధికంగా డిజిటల్ స్ట్రీమింగ్ కే జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు కూడా థియేటర్ల ద్వారా గతంలో మాదిరిగా భారీ వసూళ్లను రాబట్టలేక పోతున్నారు. ఓటీటీ ఖాతాదారుల సంఖ్య పదుల రెట్లు ఇండియాలో పెరిగినట్లుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న విషయం.ఇండియాలో ప్రముఖ ఓటీటీ లు పోటీ పడి మరీ ఒరిజినల్ కంటెంట్ ను ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ ల నిర్మాణం పై అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ ఇతర ఓటీటీ లు దృష్టి పెడుతున్నాయి. కేవలం హిందీ కే పరిమితం కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు అమెజాన్ భారీ ఎత్తున నిధులు సమకూర్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగు లో ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు తెరకెక్కతున్నాయి. అందులో నాగ చైతన్య కీలక పాత్రలో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది. దానికంటే ముందు మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. జులై 8న స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

విభిన్నమైన కథలతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు నగేష్ కుకునూరు దర్శకత్వం వహించాడు. ఈమద్య కాలంలో ఈయన వర్క్ చేసిన ప్రాజెక్ట్ ల్లో దాదాపు అన్ని కూడా నిరాశ పరిచాయి.

వెబ్ సిరీస్ విషయానికి వచ్చేప్పటికి ఖచ్చితంగా పరిమితులు ఉండవు కనుక ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలతో ఆకట్టుకోలేక పోయిన నగేష్ కుకునూరు ఈ వెబ్ సిరీస్ తో అయినా తన ప్రతిభను నిరూపించుకుంటే మళ్లీ దర్శకుడిగా సినిమాల్లో పెద్ద ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ పై ప్రస్తుతానికి హైప్ భారీగా ఏమీ లేదు. కాని స్ట్రీమింగ్ అయిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.