టాలీవుడ్ స్టార్స్ అందరి నోటా ఒకటే మాట..!

Mon May 03 2021 14:00:01 GMT+0530 (IST)

Tollywood stars all note the same word ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంగీత దర్శకుల గురించి చర్చలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు దేవిశ్రీ ప్రసాద్ - తమన్. కానీ రోజులు మారుతున్నా కొద్దీ సంగీతప్రియుల అభిరుచులు కూడా మారుతున్నాయి. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరిని స్వాగటిస్తున్నారు. కానీ ఒకరిద్దరికే బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సంగీతప్రియులు మొత్తం తమన్ సంగీతానికి అట్ట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు తమన్ సంగీతం అందిస్తున్నాడు అంటే చాలు.. సినిమా మినిమం హిట్ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది.అందుకే స్టార్ హీరోస్ నుండి యంగ్ హీరోస్ వరకు అందరికి తమన్ పేరు ఫస్ట్ ఛాయస్ అయింది. ఈ మధ్యకాలంలో తమన్ సంగీతం అందించిన సినిమాలు ఓ రేంజిలో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. కథాకథనాలు పరంగా సినిమాలు ఎలా ఉన్నా తమన్ మ్యూజిక్ మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందుకే ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్ని తమన్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు జనాల టేస్ట్ కు తగ్గట్టుగా పాటలతో పాటు బాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ అనిపించుకుంటున్నాడు తమన్. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీని సాంగ్స్ - బాక్గ్రౌండ్ తో ఎలా ఎలివేట్ చేసాడో తెలిసిందే.

అయితే తాజాగా మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా ఓకే అయింది. హారిక అండ్ హాసిని బ్యానర్ వారు నిర్మించనున్న ఈ సినిమాను కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఇటీవలే మ్యూజిక్ తమన్ అని పేరు రివీల్ చేశారు. ఈ విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజిలో ఖుషీ అవుతున్నారు. అలాగే ప్రస్తుతం మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' మూవీకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలయ్య అఖండ నాని టక్ జగదీష్ లైన్ లో ఉన్నాయి. త్రివిక్రమ్ తో సినిమా మహేష్ - తమన్ కాంబినేషన్ లో 5వ మూవీ. చూడాలి మరి ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పై పుకార్లు మాయం అవుతాయేమో!