'బాలీవుడ్'లోకి టాలీవుడ్ స్టార్ యాక్టర్..?

Thu Jun 10 2021 15:00:01 GMT+0530 (IST)

Tollywood star actor into Bollywood

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే.. జగపతి బాబు పేరే మొదటిగా వినిపిస్తుంది. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టిన జగ్గుభాయ్.. ఫ్యామిలీ హీరోగా విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో స్టార్ హీరోగా సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలాంటి వేషమైనా ఇట్టే మెప్పించగల జగ్గుభాయ్.. త్వరలోనే బాలీవుడ్ సినిమాలో మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ స్పీడ్ చూసాక ఒక దశలో అవకాశాలు లేక ఇబ్బందిపడ్డట్టు తెలిపిన జగ్గుభాయ్ ఇప్పుడు మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు.బోయపాటి దర్శకత్వంలో లెజెండ్ సినిమాతో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగ్గూభాయ్.. అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. లెజెండ్ తర్వాత విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే సౌత్ లో ఏ భాష నుండి ఆఫర్ వచ్చినా జగ్గుభాయ్ ఎల్లప్పుడూ సిద్ధమే అంటున్నాడు. అందుకే తమిళ మలయాళం కన్నడ తెలుగు అనే తేడాలేకుండా వరుసగా చేసుకుంటూ పోతున్నాడు. కానీ తాజాగా జగ్గుభాయ్ పేరు బాలీవుడ్ లో మారుమోగనుందా అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. ఎందుకంటే ఇటీవలే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నుండి పిలుపు వచ్చిందట.

అయితే ఆ సినిమాలో జగపతిబాబును విలన్ గా ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ బాలీవుడ్ సినిమా ఓకే అయిందో లేదో తెలియదు కానీ జగ్గుభాయ్ క్యారెక్టర్ పై మాత్రం రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ వర్గాలు విలన్ రోల్ అంటుండగా.. టాలీవుడ్ వర్గాలలో హీరో తండ్రి క్యారెక్టర్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ స్టార్స్ పై దృష్టి పెడుతున్నారు. అందుకే ఒక్కో సినిమాలో ఒక్కో సౌత్ స్టార్ కనిపిస్తున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ సినిమాలో నాగచైతన్య ఛాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు జగ్గుభాయ్ పేరు వినిపించే సరికి ఈ వార్తలపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. అయితే సినిమా ఏంటి.. దర్శక నిర్మాతలు ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జగ్గుభాయ్ చేతినిండా సౌత్ సినిమాలు ఉన్నట్లు సమాచారం.