Begin typing your search above and press return to search.

వైరం కోరుకోని రెజీనా

By:  Tupaki Desk   |   7 July 2022 12:30 AM GMT
వైరం కోరుకోని రెజీనా
X
టాలీవుడ్ లో రెజీనా మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్ లు దాదాపుగా ఒకే సమయంలో ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరి కెరీర్‌ చిన్న సినిమాలతోనే మొదలు అయ్యింది. కాని అనూహ్యంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ స్టార్‌ హీరోయిన్ గా మారి స్టార్‌ హీరోతో అవకాశాలు దక్కించుకోగలిగింది. బాలీవుడ్‌ లో ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారింది. కానీ రెజీనా మాత్రం అదృష్టం కలిసి రాకపోవడంతో ఇంకా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు మీడియం రేంజ్.. చిన్న సినిమాలను చేస్తున్న రెజీనా ట్యాలెంట్‌ విషయంలో ఇతరులతో పోల్చితే మూడు నాలుగు మార్కులు ఎక్కువే పొందుతుంది. అందం విషయంలో కూడా చాలా మంది టాప్ హీరోయిన్స్ తో పోల్చితే రెండు మూడు ఆకులు ఎక్కువే అందం విషయంలో చదివింది అనిపిస్తుంది. కాని రెజీనా మాత్రం స్టార్‌ అవ్వలేక పోయింది.

ఈమద్య కాలంలో హీరోయిన్ గా కూడా ఈమె కు ఆఫర్లు తగ్గాయి. దాంతో తాజాగా ఒక ప్రముఖ ఆహా కోసం అన్యస్ ట్యుటోరియల్‌ వెబ్‌ సిరీస్ లో నటించింది. నటిగా మరోసారి తనను ఈ వెబ్‌ సిరీస్ ద్వారా చూపించబోతున్నట్లుగా రెజీనా నమ్మకంగా చెబుతోంది. వెబ్‌ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమంలో రెజీనా పాల్గొంటుంది. ఈ సందర్బంగా కాంట్రవర్సీకి దూరంగా ఉంటుంది.

గతంలో ఈమె కు పలు ఇంటర్వ్యూల్లో టాలీవుడ్‌ కు చెందిన ఒక పెద్ద హీరోతో ప్రేమ వ్యవహారం సాగుతుందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై స్పందించాలంటూ చాలా సందర్భాల్లో మీడియా కోరడం జరిగింది. ఆ వ్యవహారం వల్ల టాలీవుడ్‌ లో ఆఫర్లు తగ్గాయి అనేది కొందరి అభిప్రాయం. రెజీనా కూడా అదే అభిప్రాయంతో ఏకీభవించినట్లుగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ మ్యాటర్ ను తన ఇంటర్వ్యూల్లో ఉండకుండా చూసుకుంటుంది.

తమిళ హీరోతో ప్రేమ వ్యవహారం కు సంబంధించిన పుకార్లు కూడా ఆ మధ్య ప్రముఖంగా వినిపించాయి. ఆ విషయంలో కూడా రెజీనా క్లారిటీ ఇవ్వాల్సి ఉందంటూ గతంలో మీడియా నుండి ఒత్తిడి వచ్చింది. కాని ఇప్పుడు ఆమె ఆ విషయంలో కూడా ముందుగానే మీడియాను కన్విన్స్ చేసి అందుకు సంబంధించిన ప్రశ్నలు లేకుండా ఇంటర్వ్యూ.. టాక్ షో లు ఉండేలా ఆమె తరపు పీఆర్ టీమ్‌ ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి ఇండస్ట్రీలో ఎవరినీ నొప్పించకుండా... ఎవరిని కూడా టార్గెట్‌ చేయకుండా.. ఎవరితో కూడా వైరం పెట్టుకోకుండా రెజీనా కెరీర్ ను కంటిన్యూ చేయాలని ఆశ పడుతోంది. అందుకే అలాంటి ప్రశ్నలు లేకుండా ముందస్తుగానే ప్లాన్‌ చేసుకుంటుందని.. అందులో భాగంగానే తాజాగా ఒక ప్రముఖ కమెడియన్‌ చేసే టాక్ షో లో రెజీనా ను ఎలాంటి వివాదాస్పద ప్రశ్నలు అడగలేదని టాక్‌.