బిగ్ ట్రబుల్స్ లో టాలీవుడ్ ప్రొడ్యూసర్?

Tue Jan 24 2023 16:00:02 GMT+0530 (India Standard Time)

Tollywood producer in Big Trouble

సినీ ఇండస్ట్రీలో ఎవరి జాతకాలు ఎప్పుడు తారు మారవుతాయో అంచనా వేయడం చాలా కష్టం. ఈ రోజు లైమ్ లైట్ లో వుండి భారీ సక్సెస్ లని దక్కించుకున్న వారే ఆ తరువాత సరైన ప్లానింగ్ లోపించి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు. లేదా తెర మరుగై పోవచ్చు. ఇక్కడ రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతుంటాయి. ప్రతీ ఫ్రైడే జాతకాలు మారే ఇండస్ట్రీ ఇది. అన్నీ తెలిసే ఇండస్ట్రీలోకి వస్తుంటారు.. వెళుతుంటారు. టాలీవుడ్ లో ఓ ప్రొడ్యూసర్ ప్రస్తుతం ఇలాంటి సరిస్థితుల్నే ఎదుర్కొంటున్నాడట.వివరాల్లోకి వెళితే.. చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఓ నిర్మాత ఆ తరువాత ఓ యంగ్ హీరో సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుని ఆకట్టుకుని ఆయన క్యాంప్ లో చేరిపోయాడు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవు కదా.. టైమ్ మారింది.. నిర్మాత ఫేట్ మారింది. డౌన్ ఫాల్ మొదలైంది అనే కామెంట్ లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.

గత కొంత కాలంగా దిల్ రాజు సపోర్ట్ తో మీడియం రేంజ్ టైర్ టు హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన సదరు నిర్మాత రీసెంట్ గా ఓ మినిమం గ్యారెంటీ హీరోతో చేసిన సినిమా అతనికి బిగ్ షాకిచ్చింది. ఫైనాన్స్ రికవర్ చేయలేకపోవడంతో చివరి నిమిషంలో సదరు నిర్మాత నిర్మించిన సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అక్కడి నుంచే అతనికి కష్టాలు మొదలయ్యాయని చెబుతున్నారు. హీరోల వద్ద గుడ్ విల్ పోవడం భారీ గా నష్టాలని చవి చూడటంతో ప్రస్తుతం ఈ నిర్మాత బిగ్ ట్రబుల్స్ ని ఎదుర్కొంటున్నాడట.

చేతిలో సినిమాలున్నా.. ఇద్దరు ముగ్గురు హీరోల డేట్స్ వున్నా సినిమాలు నిర్మించలేని పరిస్థితి.. ఇప్పటికే షూటింగ్ దశలో వున్న సినిమాలకు తను పేరుకు మాత్రమే నిర్మాత అని అన్ని బాధ్యతల్ని మిగతా వారికి అప్పగించాడని ఇన్ సైడ్ టాక్. ఓ యంగ్ హీరో సినిమా కారణంగానే సదరు నిర్మాత కెరీర్ తిరిగి తిరిగి మళ్లీ మొదటికి వచ్చేసిందని ఆ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుని వుంటే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పలువురు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.