అన్ని భాషలకి టాలీవుడ్ హబ్.. ఆలెక్క ఎలా అంటే?

Tue Jun 28 2022 22:00:01 GMT+0530 (IST)

Tollywood hub for all languages

హైదరాబాద్ ని ఫిల్మ్ ఇండస్ర్టీ హబ్ గా మారుస్తామని  తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కాగానే..తెరాసా ప్రభుత్వం గట్టిగానే చెప్పింది.  ఇండస్ర్టీ భివృద్దిలో భాగంగా స్టూడియోల నిర్మాణానికి కొత్తగా స్థలాలు సైతం కేటాయించింది. కానీ ఇప్పటికీ వాటిలో పునాది రాయి పడలేదు. కేటాయించిన స్థలం సిటీకి దూరంగా ఉండటం సహా పలు కారణాలుగా సినిమా పెద్దలు అనాసక్తి చూపిస్తున్నారు.ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి పెట్టింది లేదు. మీడియాలో మాటలు కోటలు దాటడం తప్ప! హైదరాబాద్ ని హాబ్ గా మారుస్తామన్న మాట ఇంకా ప్రభుత్వం వైపు నుంచి నిజం కాలేదు. కానీ ఇటీవల కాలంలో చోటు చేసుకుంటోన్న కొన్ని పరిణామాలు..సన్నివేశాలు చూస్తుంటే టాలీవుడ్  సాకేతికంగా కాకపోయినా అన్ని భాషల సినిమాలకి హబ్ గా మారిపోయిందనే అనిపిస్తుంది.

అవును గత రెండు మూడేళ్లగా హైదరాబాద్ లో అన్ని భాషల సినిమాల నిర్మాణం చాలా విరివిగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీ..రామానాయుడు స్టూడియోస్ నానాక్రామ్ గూడ సహా... సిటీ ఔట్ కట్స్ లో ఖాళీ గా ఉన్న స్థలాల్లో ప్రత్యేకంగా సెట్లు నిర్మించి ఇతర భాషల సినిమాలు నిర్మాణం జరుపుకోవడం గమనించదగ్గ విషయం. తెలుగులో పాటు..హిందీ.. మలయాళం.. తమిళం..కన్నడ భాషల సినిమాలు ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో నే ఎక్కువగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

వాస్తవానికి చాలా  చాలా కాలంగా  ఈవిధానంలో షూటింగ్ లు జరుగుతున్నప్పటికీ గత రెండేళ్లలో మరింత పెరిగిందని చెప్పొచ్చు.  తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అవ్వడం.. కోలీవుడ్ హీరోలు తెలుగులో సినిమాలు చేయడం ప్రారంభించడం..సాంకేతికంగానూ హైదరాబాద్ మరింత వృద్దిలోకి రావడం వంటి అంశాలు కీలకంగా మారాయి.

ఓవర్సీస్ లో తెలుగు సినిమా మార్కెట్ విస్కృతంగా పెరగడం వంటి అంశాలు సైతం హైదరాబాద్ వైపు చూడటం మరో బలమైన కారణంగా చెప్పొచ్చు. ఇక హిందీ-తెలుగు నటీనటుల మధ్య కొనసాగుతోన్న ప్రెండ్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీ హీరోలు హైదరాబాద్ షూటింగ్ లో ఉంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్దలు వాళ్లని ఇంటికి పిలిచి లంచ్..డిన్నర్ పార్టీలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు.

ఇటీవలే సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్..కమల్ హాసన్..లోకేష్ కనగరాజ్ లాంటి వారిని చిరంజీవి ఇంటికి ఆహ్వానించి సన్మానించడం.. భోజన ఏర్పాట్లు చేయడం  వంటివి తెలిసిందే. ఇంకా సమయం దొరికితే కలిసి పార్టీలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.  అలాగే రామ్ చరణ్..ఉపాసన..సల్మాన్ ఖాన్..వెంకటేష్ అంలా ఒకేచోట కలిసిన సంగతి తెలసిందే.

అటు పై  ప్రభాస్..ప్రశాంత్ నీల్..అమితాబచ్చన్..రాఘేవంద్రరావు..నాని  దుల్కార్ సల్మాన్..నాగ్ అశ్విన్ ఒకేచోట కలిసి మాట  మంతి నిర్వహించారు. గతంలో ఎప్పుడూ ఈ విధమైన కల్చర్ కనిపించలేదు. సినిమా భాషల మధ్య హద్దుల్ని చేరిపిస్తుందని ఈ సన్నివేశం మరోసారి రుజువు చేసింది. ఒకప్పుడు భాషల పేరుతో వేరియేషన్ చూపించేవారు.

ఇప్పుడా ఒరవడి లేదు. ఒకరు సినిమాల్లో ఒకరు నటించడం...సహాకారం అందించుకోవడం అంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో సాగుతోంది. ఆ రకంగా హైదరాబాద్ లో వెలిసిన టాలీవుడ్ ఇతర భాషల నటులతో కళకళలాడుతూ హబ్ గా మారింది. హైదరాబాద్ సాంకేతికంగా హబ్ గా మారకపోయినా! ఈ రకమైన వాతావరణం ఏర్పడటం హర్షించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు.