సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోల జోరు

Wed Jul 08 2020 13:20:34 GMT+0530 (IST)

Tollywood heroes Craze on social media

సోషల్ మీడియాల్లో ఎంతగా ఫాలోయింగ్ ఉంటే అంతగా క్రేజు. దానికి మించిన ఆదాయం. ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఫాలోయింగ్ ఉంటే అంతగా ట్విట్టర్.. ఎఫ్.బీ.. ఇన్ స్టాలో వ్యూవర్స్ సంఖ్య పెరుగుతుంటుంది. టాలీవుడ్ స్టార్లలో సూపర్ స్టార్ మహేష్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. డార్లింగ్ ప్రభాస్ కి వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఆ ముగ్గురూ నిరంతరం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూ ట్విట్టర్ లో ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.తాజాగా ఈ హీరోల ఫాలోయింగ్ ఎంత? అన్నది ఆరా తీస్తే... సౌత్ ఇండియాలోనే అత్యధికంగా ట్విట్టర్ లో ఫాలోయింగ్ ఉన్న హీరోగా మహేష్ అవతరించారు. 2019లోనే ట్విట్టర్ లో బెస్ట్ ఫాలోయింగ్ సంపాదించిన స్టార్ గా మహేష్ పేరును ట్విట్టర్ ఇండియా ప్రకటించింది. మహేష్ కు టాప్ 5లో చోటు దక్కింది. ప్రభాస్ ట్విట్టర్ లో లేరు. కానీ ఇన్ స్టాలో ఫాలోవర్స్ సంఖ్య 47 లక్షలు. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య కోటి (10 మిలియన్స్) కి చేరుకుంది. సౌత్ లోనే టాప్ వన్ గా నిలిచారు.

అయితే సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ పెరగాలంటే నిరంతర అప్ డేట్స్ ఉండాలి. అలాగే స్టార్ల వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన అంశాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఫోటోలు వీడియోలతో వేడి పెంచాల్సి ఉంటుంది. ఆ కోవలో ఆ హీరోలు యమ స్పీడ్ గా ఉన్నారనే చెప్పాలి.  ఇక బాహుబలి స్టార్ గా ప్రభాస్ గురించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఇక మహేష్ కి సౌత్ లో ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఇలా జరంత స్పీడ్ చూపించేందుకు కారణమవుతోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సూపర్ స్టార్ మహేష్ .. చాలా ముందుగానే ట్విట్టర్.. ఫేస్ బుక్ మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి ఇతర స్టార్ల కంటే స్పీడ్ చూపించారు.  ఆ ఇద్దరూ ఈ వేదికల్లో అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటున్నారు. ఆ తర్వాత ప్రభాస్.. చరణ్ లాంటి స్టార్లు చాలా ఆలస్యంగా సామాజిక మాధ్యమాల్లో టచ్ లోకి వచ్చారు. నిరంతరం లక్షలాది అభిమానులు సదరు స్టార్లను సోషల్ మీడియాల్లో అనుసరిస్తున్నారు.

ఇక మహేష్ కంటే తమిళ హీరో తళా అజిత్ ట్విట్టర్ ట్రెండ్స్ లో ఇంకా స్పీడ్ గా ఉన్నారు. ఆయన ట్విట్టర్ లో ఏకంగా నంబర్ వన్ స్థానంలో నిలిచారు. మహేష్ నటించిన మహర్షి.. తళా అజిత్ నటించిన విశ్వాసం చిత్రాల అప్ డేట్స్ కోసం అభిమానులు ట్విట్టర్ లో నిరంతరం సెర్చ్ చేయడంతో ఆ ఇద్దరి పేర్లు టాప్ 5లో నిలిచాయి.