Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: టాలీవుడ్ హీరో దాసరి అరుణ్ అరెస్ట్

By:  Tupaki Desk   |   20 Jan 2022 9:16 AM GMT
బ్రేకింగ్: టాలీవుడ్ హీరో దాసరి అరుణ్ అరెస్ట్
X
దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించారో.. ఆయన కడుపున పుట్టిన కుమారులు మాత్రం అంతగా వివాదాలతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఆస్తి గొడవల్లో రోడ్డున పడ్డ వారు తాజాగా మరో వివాదంలో ఆయన చిన్న కుమారుడు, టాలీవుడ్ హీరో దాసరి అరుణ్ చిక్కుకున్నాడు.

ర్యాష్ డ్రైవింగ్ కేసులో హీరో దాసరి అరుణ్ ను పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దాసరి అరుణ్ ఉన్నట్టుగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన దాసరి అరుణ్.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు సమాచారం అందుతోంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన బంజారాహిల్స్ పోలీసులు దాసరి అరుణ్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో దాసరి అరుణ్ కుమార్ హాజరయ్యారు.

బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేసి డ్రింక్ తాగినట్టు తేలితే కఠినచర్యలు తప్పవని అంటున్నారు.