పంజాబీ మూవీస్ వైపు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..?

Thu Jun 17 2021 22:00:01 GMT+0530 (IST)

Tollywood glamour heroine towards Punjabi movies

తెలుగు తెరపై 'ఆర్ఎక్స్100' సినిమాతో అడుగు పెట్టింది ఢిల్లీ సోయగం పాయల్ రాజపుత్. మొదటి సినిమాలోనే బోల్డ్ క్యారెక్టర్ పోషించి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. డెబ్యూ మూవీనే పెద్ద సక్సెస్ తో పాటు అవార్డు కూడా తెచ్చిపెట్టడంతో తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. క్రేజ్ అయితే వచ్చింది కానీ పాయల్ కు అవకాశాలు పెద్దగా రాలేదు. 'ఆర్ఎక్స్100' తర్వాత 'ఆర్డిఎక్స్ లవ్' అనే మరో బోల్డ్ సినిమాలో నటించింది. ఆ సినిమాతో పాయల్ కుర్రకారుకి మతిపోయే అందాలను ఎరగా వేసింది. కానీ అమ్మడి కెరీర్లో ఆ సినిమా పెద్ద డిసాస్టర్ గా మిగిలిపోయింది.తర్వాత చేసేదేం లేక బెల్లంకొండ శ్రీనివాస్ 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఇక 2019లో నాగచైతన్య విక్టరీ వెంకటేష్ ల మల్టీస్టారర్ 'వెంకిమామ' సినిమాలో వెంకీకి జోడిగా నటించింది. ఆ సినిమాకు హిట్ టాక్ వచ్చినా పాయల్ కు అవకాశాలు మాత్రం రాలేదు. అయితే ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు ఓటిటిల వైపు మళ్లుతున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో ఓటిటిలే సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అటు సినిమాలు చేస్తున్నా ఇటు ఓటిటిలకు ఓకే చెప్పడం మాత్రం ఆపట్లేదు. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్స్ అంతా ఓటిటి బాటపట్టిన సంగతి తెలిసిందే. అలా పాయల్ కూడా ఓటిటిలో ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ కూడా అవకాశాలు లేవు. ఇప్పటివరకు పాయల్ కెరీర్ లో ఆర్ఎక్స్100 తర్వాత అంతటి బలమైన క్యారెక్టర్ మళ్లీ రాలేదు. అయితే ఈ ఓటిటి వెబ్ ఫిల్మ్ ఆ లోటు తీర్చుతుందని నమ్మింది. నటనకు ఎమోషన్స్ పండించడానికి ఆస్కారం ఉందని పాయల్ పచ్చజెండా ఊపిందట. మరి ప్రస్తుతం తెలుగులో ఓ ఓటిటి ఫిల్మ్ చేస్తోంది. కానీ తన లక్ష్యం ఓటిటి కాదని సినిమాలే ముఖ్యం అంటోందట. అందుకే ఇప్పుడు మళ్లీ తనకు మంచి క్రేజ్ కలిగిన పంజాబీ మూవీస్ వైపు దృష్టిపెడుతున్నట్లు టాక్. ఆల్రెడీ పంజాబీ భాషలో పాయల్ పలు సినిమాలు చేసింది. తెలుగులో అవకాశాలు వచ్చాయని ఆ సినిమాలు లైట్ తీసుకుంది. ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పంజాబీ వైపు వెళ్తుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో ఏంజెల్ అనే సినిమా చేస్తోంది. చూడాలి మరి త్వరలో బిజీ అవుతుందేమో..!