ఫాదర్స్ అండ్ సన్స్ తో నిండిపోయిన టాలీవుడ్..!

Sun May 02 2021 13:00:01 GMT+0530 (IST)

Tollywood full of Fathers and Son

టాలీవుడ్ లో ప్రస్తుతం కొన్ని కుంటుంబాలకు చెందిన నటీనటుల హవా నడుస్తోంది. ఇండస్ట్రీ మొత్తం ఫాదర్స్ అండ్ సన్స్ తో నిండిపోయింది. అప్పటికే కొన్నేళ్లుగా తండ్రులు హీరోలుగా సినిమాలు చేస్తుంటే.. ఇప్పుడు వారి బాటలో కొడుకులు కూడా వచ్చారు. అలానే కజిన్స్ - అల్లుళ్లని కూడా హీరోలుగా పరిచయం చేశారు. మెగా ఫ్యామిలీ - దగ్గుబాటి - నందమూరి - అక్కినేని ఫ్యామిలీ.. కేవలం ఈ నాలుగు కాంపౌండ్స్ నుంచి వచ్చిన హీరోలే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తున్నారు.ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి.. కొన్ని దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నాడు. చిరు అండతో సన్స్ అండ్ అల్లుళ్లు కలుపుకొని దాదాపు డజను మంది టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయి తేజ్ - వైష్ణవ్ తేజ్ - కళ్యాణ్ దేవ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ వంటి వారు హీరోలయ్యారు. విక్టరీ వెంకటేష్ ఒకవైపు సత్తా చాటుతుంటే.. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా కూడా పోటీగా వచ్చాడు. త్వరలోనే చినబాబు దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ కూడా ఉండబోతోంది.

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ - తారకరత్న హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా డెబ్యూ ఇవ్వనున్నాడు. అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున - నాగచైతన్య - అఖిల్ - సుమంత్ - సుశాంత్ వంటి హీరోలున్నారు. ఇక మహేష్ బాబు హీరోగా రాణిస్తుంటే.. బావ సుధీర్ బాబు కూడా హీరో అయ్యాడు. సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వారు అడపాదడపా తళుక్కుమంటున్నారు. రవితేజ - నాని - విజయ్ దేవరకొండ వంటి వారు సత్తా చాటుతున్నారు. ఏదేమైనా టాలీవుడ్ కూడా బాలీవుడ్ మాదిరిగా నెపోవుడ్ అయిపోతోంది. కాకపోతే ఎవరూ ఇది గ్రహించడం లేదందే..!