తాజా మిస్ ఇండియా పై మన ఫిల్మ్ మేకర్స్ మోజు

Wed Jul 06 2022 19:04:27 GMT+0530 (IST)

Tollywood film makers on sini shetty femina miss india

ట్యాలెంట్ ను ప్రోత్సహించడంలో మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ముందు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ను ఎక్కడో ముంబయిలో... ఇతర ఉత్తర భారతంలో ఉన్న వారిని తీసుకు వచ్చి స్టార్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ తెలుగు అమ్మాయిలను కాకుండా ఉత్తరాది అమ్మాయిలను మరియు కేరళ.. బెంగళూరు మరియు చెన్నై ముద్దుగుమ్మలను స్టార్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఇప్పుడు మన స్టార్ ఫిల్మ్ మేకర్స్ నుండి చిన్న ఫిల్మ్ మేకర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా తాజా మిస్ ఇండియా సిని శెట్టి వైపు అడుగులు వేస్తున్నారు.

ఆమె హీరోయిన్ గా నటిస్తే సినిమాకు పబ్లిసిటీకి పబ్లిసిటీ మరియు ఆమెను ఇండస్ట్రీకి తీసుకు వచ్చామనే ఘనత దక్కుతుందని చాలా మంది నిర్మాతలు మరియు దర్శకులు ఆమె కాంటాక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

మిస్ ఇండియా గా గెలిచిన ఎంతో మంది అందగత్తెలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్స్ గా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు సిని శెట్టి కూడా సినిమా లో అడుగు పెడితే ఖచ్చితంగా ముందు ముందు ఆమె స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతానికి ఆమె సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది.

కన్నడ ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే కొందరు ఆమెకు అడ్వాన్స్ లు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా ఆమెను సంప్రదించే వారి సంఖ్య భారీగా ఉందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తాజా మిస్ ఇండియా సిని శెట్టి ఖచ్చితంగా అతి త్వరలోనే టాలీవుడ్ సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.

ఈ ఏడాది చివరి వరకు కాకున్నా వచ్చే ఏడాది వరకు తెలుగు సిల్వర్ స్క్రీన్ పై మన స్టార్స్ కు జోడీగా సిని శెట్టి కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ టాలీవుడ్ సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.