#RAPO19 ః దేవి వల్ల రామ్ కెరీర్ లోనే రికార్డ్ ధర

Tue Aug 03 2021 19:00:01 GMT+0530 (IST)

Tollywood energetic star Pothineni Ram

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేయగలడు రామ్. దేవదాస్ సినిమాతో ఆరంగ్రేటం చేసిన ఈ యంగ్ స్టార్ సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ స్టార్ డమ్ తో దూసుకు పోతున్నాడు. తొలి సినిమాతోనే తాను బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రామ్ ఆ తర్వాత వరుసగా సినిమాలతో కెరీర్ లో దూసుకు పోతున్నాడు. రామ్ హీరోగా చాలా మంది డైరెక్టర్లతో సినిమాలు చేశాడు.



నటుడు రామ్ డాన్సులు నటన ఫైట్లు ఇరగదీస్తాడనే విషయం అందరికి తెల్సిందే. పూరి జగన్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే బ్లాక్ బస్టర్ సినిమాలో నటించాడు. ఈ మూవీలో రామ్ సరసన అందల భామలు నభా నటేష్ నిధి అగర్వాల్ నటించారు. గత కొన్ని రోజులుగా హిట్ లేని రామ్ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చి అందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. రామ్ హైదరాబాద్ లనే జన్మించినా తన విద్యాభ్యాసం మొత్తం చెన్నైలో సాగడం విశేషం. తన సొంత బ్యానర్ స్రవంతి ఆర్ట్స్ పతాకం పైనే ఆయన ఎక్కువగా సినిమాల్లో నటించాడు. ఇప్పటి వరకు రామ్ హీరోగా 18 సినిమాలు చేశాడు. వీటిల్లో ఎక్కువ భాగం తన సొంత నిర్మాణ సంస్థలోనే చేయడం గమనార్హం.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో కోలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన లింగు సామితో యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. కాగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ వేగం పుంజుకుంది. కాగా రామ్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ గురించి ఒక వార్త ఫిలిం సర్కిళ్లలో షికారు చేస్తోంది. అదేంటంటే ఈ సినిమా ఆడియో హక్కులు అత్యధిక ధరకు అమ్ముడు పోయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయట. ఈ మూవీ ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ దాదాపు అందరూ ఆశ్చర్య పోయే రీతిలో 2.75 కోట్లు వెచ్చించి దక్కించుకున్నట్లు సమాచారం. కాగా ఈ 2.75 కోట్ల రూపాయలు తెలుగు తమిళ ఆడియో హక్కుల కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది.

రామ్ కెరీర్ లోనే ఇంతలా మ్యూజిక్ రైట్స్ ను దాదాపు 2.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం ఇదే ప్రథమం అని చెబుతున్నారు. తెలుగు మరియు తమిళంలో స్టార్ కంపోజర్ గా గుర్తింపు దక్కించుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు ఆ రేంజ్ లో ఆడియో రైట్స్ పలికినట్లుగా సమాచారం అందుతోంది. ఇకపోతే ఈ మూవీలో యంగ్ హీరో రామ్ సరసన ఇటీవలే ఉప్పెన సినిమాతో హిట్ అందుకుని కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది.