ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్ జంట..!

Fri Jun 04 2021 10:00:01 GMT+0530 (IST)

Tollywood couple falling in love

సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ అనేవి కామన్ గా వినిపిస్తుంటాయి. ఒక సినిమాలో నటించే హీరో హీరోయిన్లు బయట కలిసి తిరగడం కనిపిస్తే ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ పుట్టుకొస్తాయి. అయితే కొందరు నిజంగానే ప్రేమాయణం సాగించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు లేటెస్టుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఓ టాలీవుడ్ జంట ప్రేమలో మునిగితేలుతున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఓ పెద్ద ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో - ఓ గార్జియస్ బ్యూటీ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్లాపుల్లో ఉన్న వీరిద్దరి కెరీర్ కి ఈ మూవీ సక్సెస్ కీలకంగా మారింది. దీని కోసం న్యూ ఏజ్ లవ్ స్టోరీని ఎంచుకున్న ఈ జంట.. రెచ్చిపోయి నటించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. అయితే ఇద్దరి మధ్య ఈ రేంజ్ లో కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి కారణం.. ఆఫ్ స్క్రీన్ లో వారి మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ షిప్ అని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

ఫిల్మ్ నగర్ వీధుల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా వీరిద్దరి మాటే వినిపిస్తోంది. నిజానికి వీళ్లు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూసే ఏదో వ్యవహారం నడుస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ రూమర్స్ కి ఆజ్యం పోసింది సదరు హీరోయిన్. ఇటీవల పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న హీరో ఇంటికి పెద్ద కేక్ పంపించిందట. ఇది చూసి షాక్ కి గురైన హీరో ఫ్యామిలీ మెంబర్స్.. ఎందుకు ఇంత స్పెషల్ గా కేక్ పంపిందని ఆరా తీయడం మొదలుపెట్టారట. మరి వీరిద్దరి మీద వస్తున్న రూమర్స్ త్వరలోనే నిజమవుతాయేమో చూడాలి.