Begin typing your search above and press return to search.

మరో మంచి కంటెంట్ ఓరియంట్ ఫిల్మ్‌ ని కిల్ చేసిన టాలీవుడ్‌

By:  Tupaki Desk   |   29 Jan 2023 6:00 AM GMT
మరో మంచి కంటెంట్ ఓరియంట్ ఫిల్మ్‌ ని కిల్ చేసిన టాలీవుడ్‌
X
ఈ మధ్య కాలంలో ఎంత మంచి కంటెంట్ తో సినిమా తీసినా కూడా ప్రమోషన్స్‌ ను భారీగా చేయకుంటే.. విభిన్నంగా చేసి జనాల్లోకి తీసుకు వెళ్తే తప్ప జనాలకు రీచ్‌ అవ్వడం లేదు. సినిమా కంటెంట్‌ పై నమ్మకంతో కొందరు ప్రమోషన్‌ చేయడం లేదు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

ఈ ఫార్ములా డబ్బింగ్ సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఆ మధ్య సూపర్‌ హిట్ తమిళ చిత్రం లవ్ టుడే ను తెలుగు లో దిల్ రాజు డబ్‌ చేసి విడుదల చేయడం జరిగింది. లవ్ టుడే తమిళనాట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్‌ కు కనెక్ట్‌ అయ్యే విధంగా లవ్ టుడే సినిమా ఉంటుందని దిల్‌ రాజు భావించాడు. కానీ కథ అడ్డం తిరిగింది.

లవ్‌ టుడే సినిమా కు తెలుగు యువత బ్రహ్మరథం పడతారని ఆయన భావించాడు. పెద్దగా ప్రమోషన్ చేయకుండానే విడుదల చేయడం జరిగింది. దాంతో థియేట్రికల్‌ రిలీజ్ అయిన లవ్ టుడే కు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ నమోదు కాక పోవడంతో దిల్‌ రాజు పై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఓటీటీ లో తెలుగు లవ్‌ టుడే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా మలయాళ సూపర్‌ హిట్ చిత్రం మాలికాపురం అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు పైగా కేరళ బాక్సాఫీస్ వద్ద రాబట్టిన ఆ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో విడుదల చేయడం జరిగింది. టైటిల్‌ విషయంలోనే మొదట విమర్శలు వచ్చాయి.

ప్రమోషన్స్‌ విషయంలో పెద్దగా హడావుడి చేయలేదు. కంటెంట్‌ బాగున్నా కూడా మాలికాపురం ను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఒక వేళ మంచి ప్రమోషన్స్ ను చేసి ఉంటే కచ్చితంగా మాలికాపురం సినిమాకు తెలుగు లో కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యి ఉండేవి అనడంలో సందేహం లేదు.

ఇతర భాషలకు చెందిన మంచి కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలను తెలుగు లో డబ్‌ చేసి సరైన ప్రమోషన్‌ చేయకుండా కిల్‌ చేస్తున్నారు. ఆ మధ్య వచ్చిన కాంతార సినిమా కు తెలుగు లో మంచి ప్రమోషన్స్ చేసిన గీతా ఆర్ట్స్‌ వారు భారీ వసూళ్లు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.