టాలీవుడ్.. ఈ మూడింటి చుట్టే..

Wed Jun 26 2019 10:30:50 GMT+0530 (IST)

6 పాటలు.. మూడు ఫైట్లు ఇది ఒకప్పటి తెలుగు సినిమా కథ. ఆ తర్వాత కొంత మంది ట్రెండ్ సెట్టర్ హీరోలు టాలీవుడ్ గమనాన్ని మార్చారు. మాస్ మూవీలతో స్టార్ హీరోలు హిట్ కొట్టారు. ఆ తర్వాత ప్రేమ కథల జోరు మొదలైంది. కొద్ది కాలంగా హర్రర్ మూవీల ట్రెండ్ టాలీవుడ్ లో మొదలైంది. రాజమౌళి బాహుబలితో తెలుగునాటే కాదు.. దేశవ్యాప్తంగా చారిత్రక కథలను అద్భుతంగా తెరకెక్కించవచ్చని నిరూపించారు.   కానీ అన్నీ హిట్స్ కాలేవు. తమిళంలో విజయ్ నటించిన ‘పులి’.. హిందీలో అమీర్ ఖాన్-అమితాబ్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ లాంటి కథలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే చారిత్రక కథల ఒరవడి మాత్రం కొనసాగుతోంది. బాజీరావ్ మస్తానీ పద్మావతి లాంటి సినిమాలు హిందీలో హిట్టయ్యాయి. ఇక తెలుగునాట మరో చారిత్రక కథ ‘సైరా’ వస్తోంది.ఇప్పుడు తెలుగునాట ఆ చారిత్రక కథల ఒరవడి కొనసాగుతోంది. రాజమౌళి ఆశ్చర్యకరంగా మళ్లీ చారిత్రక కథనే ఎంచుకోవడం విశేషం. తాజాగా చరిత్ర దాచిన ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి కొమురం భీంలోని భిన్న పాశ్వ్యాలను ఎంచుకొని రాజమౌళి కొత్త సినిమా తీస్తున్నారు. ఇదీ ఒక చారిత్రక గాథనే.

ఇప్పుడు ప్రభాస్ మాత్రం ఈ ట్రెండ్ బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ లో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలాంటి ‘సాహో’ తీశారు. ఇది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇందులో భారీ యాక్షన్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. బాహుబలి లాంటి చారిత్రక యోధుడి పాత్రలో ఒదిగిపోయిన ప్రభాస్.. ఇప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఎలా కనిపిస్తాడన్నది ఆసక్తికరం.

మొత్తంగా ప్రయోగాలు ఎప్పుడూ ఫలితాన్నిస్తాయి. చారిత్రక కథ అయినా.. హర్రర్ కథాంశమైనా.. చివరకు యాక్షన్ థ్రిల్లర్ అయినా ప్రేక్షకులను రెండున్నర గంటలు కూర్చుండబెట్టాలంటే కథే ప్రధానం.. ఈ విషయాన్ని గ్రహించిన వారికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో నడుస్తున్న ఈ హర్రర్ చారిత్రక కథాంశాల ఒరవడిని మరి సాహో లాంటి యాక్షన్ థ్రిల్లర్ విడుదలై బ్రేక్ చేస్తుందా.? అలాంటి సినిమాలకు పురుడు పోస్తుందా.? లేదా అన్నది మాత్రం విడుదలయ్యాకే తేలనుంది.