సంక్రాంతి ఫైట్ ఆ ముగ్గురి మధ్యేనా?

Sat Oct 01 2022 15:03:27 GMT+0530 (India Standard Time)

Tollywood Upcoming Movies Of Sankranthi Festival

ప్రతీ సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు టైర్ టు హీరోలు యంగ్ హీరోలు క్రేజీ సినిమాలతో బరిలోకి దిగుతుంటారు. అయితే ఈ ఏడాది 2022 రేస్ కరోనా కారణంగా తేలిపోవడం..పెద్ద సినిమాలేవీ పోటీకి దిగకపోవడంతో చాలా వరకు ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే 2023 సంక్రాంతి మాత్రం రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సంక్రాంతి రేస్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏఏ సినిమాలు పోటీకి దిగుతున్నాయన్నది కొంత సస్పెన్స్ కొలకొంది.తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ సంక్రాంతి సమరం ప్రధానంగా ముగ్గురి మధ్య జరిగనుందని తెలుస్తోంది. ముందుగా ఈ పోటీలో మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'తో వస్తున్నట్టుగా ప్రభాస్ టీమ్ ముందే ప్రకటించేసింది. ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ డ్రామా ఇది. దీంతో ఈ మూవీపై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి. రామాయణ గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు.

ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతున్నారు. సీతగా కృతి సనన్ కనిపించనుంది. 3డీ ఐమ్యాక్స్ ఫార్మాట్ లలో ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ఇటీవల విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. వందలకోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో విజువల్ ఫీస్ట్ గా ఈ మూవీని రూపొందించడంతో సంక్రాంతి సమరం భారీ క్రేజీగా వుండబోతోందని తెలుస్తోంది.

ఇక ఈ మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి తన 154వ ప్రాజెక్ట్ 'వాల్తేరు వీరయ్య'తో బరిలోకి దిగుతున్నారు. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చిరుకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. కీలకమైన అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. కేథరిన్ జోడీగా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి వచ్చేస్తోంది. అయితే ఈ మూవీ 12నే వస్తుందా?  లేక పండగ రోజు అయిన జనవరి 14న వస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

ఇదిలా వుంటే 'ఆదిపురుష్' రిలీజ్ రోజునే తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'వారసుడు' సంక్రాంతి బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళ తెలుగు భాషల్లో వంశీ పైడిపల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో దిగడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ 'వారసుడు' మూవీని జనవరి 12నే 'ఆదిపురుష్' రిలీజ్ రోజుని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.  

దీంతో సంక్రాంతి సమరం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవి తమిళ స్టార్ హీరో విజయ్ మధ్య హోరా హోరీగా వుండనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 'వారసుడు'మూవీ లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి రాకెట్ స్పీడుతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దీంతో ఈ సంక్రాంతికి ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ జరగడం దాదాపుగా ఖాయం అయిపోవడం గమనార్హం. మరి ఈ పోటీలో పైచేయి ఎవరు సాధిస్తారో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.