2022లో టాప్ హిట్ RRR కాదు ఇంకేదీ!

Tue May 24 2022 08:00:01 GMT+0530 (IST)

Tollywood Top Hit Fim In 2022

2022 లో ఇప్పటివరకూ బెస్ట్ మూవీ ఏదీ? అంటే.. ఆర్.ఆర్.ఆర్ కాదు. ఇంకేదీ? అంటే ఓ చిన్న సినిమాని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ కి చెప్పుకోదగ్గ హిట్లు దక్కగా.. పాన్ ఇండియా కేటగిరీలో జక్కన్న ఆర్.ఆర్.ఆర్ రారాజుగా నిలిచింది. దాదాపు 1000 కోట్లు పైగా వసూలు చేసి సంచలనంగా మారింది. అయితే ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్ ని మించిన హిట్టు ఏదీ? అంటూ ట్రేడ్ లో విశ్లేషణ సాగుతోంది.ఏడాది ఆరంభమే బంగార్రాజు హిట్ సినిమాగా నిలిచింది. నాగార్జునకు చాలా గ్యాప్ తర్వాత ఊరటనిచ్చిన చిత్రమిది. ఆ తర్వాత డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. అటుపై ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా కేటగిరీలో బ్లాక్ బస్టర్ విజయం హాట్ టాపిక్ గా మారింది.  కన్నడ నుంచి వచ్చిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2 మరో సంచలన విజయం దిశగా దూసుకెళ్లింది. ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ డబ్బింగ్ వెర్షన్లు చక్కని వసూళ్లను సాధించాయి.

2022 టాలీవుడ్ టాప్ సినిమాల షేర్ వివరాల్ని పరిశీలిస్తే..#RRRమూవీ - 609 కోట్ల షేర్ వసూలు చేయగా... #KGF2(డబ్) - 502.65 కోట్ల మేర షేర్ వసూలు చేసింది. #భీమ్లానాయక్ - 97.63కోట్లు.. #రాధేశ్యామ్ - 83.20 కోట్లు.. #ఆచార్య - 48.36  కోట్లు.. #బంగార్రాజు - 39.15 కోట్లు షేర్ వసూళ్లను రాబట్టాయి.  సర్కార్ వారి పాట - 80 కోట్ల షేర్ వసూలు చేసిందన్న టాక్ ఉంది. ఆసక్తికరంగా వీటన్నిటి నడుమా వచ్చిన #DJ టిల్లు - డబుల్ బ్లాక్ బస్టర్+ గా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని విమల్ కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఆద్యంతం రక్తి కట్టించడంతో జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమాని పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించి పెద్ద హిట్టు కొట్టారు. దాదాపు 30 కోట్ల గ్రాస్.. 17 కోట్ల షేర్ తో నవతరం హీరో సిద్ధు అదరగొట్టాడు. పెట్టిన 8 కోట్ల బడ్జెట్ కి రెట్టింపు లాభాలు తెచ్చింది ఈ మూవీ. హీరోగా సిద్ధూకి ఈ సినిమా పెద్ద ఊపు తెచ్చిందని చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ కి 350 కోట్లు పైగా పెట్టుబడి పెడితే 600కోట్ల షేర్ తెచ్చింది. కానీ డీజే టిల్లు లాంటి చిన్న సినిమా కూడా డబుల్ లాభాలు అందించిందని విశ్లేషిస్తున్నారు.

#బంగార్రాజు  హిట్
#DJTillu - డబుల్ బ్లాక్ బస్టర్+
#RRRమూవీ - బ్లాక్ బస్టర్
#KGF2(డబ్) - హిట్

షేర్ విలువలు పరిశీలిస్తే..

#RRRమూవీ - 609Cr+***
#KGF2(డబ్) - 502.65Cr****
#సర్కార్ వారి పాట - 80.62Cr****
#భీమ్లానాయక్ - 97.63కోట్లు
#రాధేశ్యామ్ - 83.20Cr
#ఆచార్య - 48.36Cr
#బంగార్రాజు - 39.15 కోట్లు
# డీజే  - 17 కోట్ల షేర్