Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్ టాప్ 10 స్టార్ల విద్యార్హ‌త‌లివే

By:  Tupaki Desk   |   17 Jun 2021 1:30 AM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్ టాప్ 10 స్టార్ల విద్యార్హ‌త‌లివే
X
ప్ర‌తిభ‌కు కొల‌మానం లేదు. డిగ్రీలు అవ‌సరం లేదు. ఎంచుకున్న మార్గంలో ప్ర‌తిభ పెద్ద డిగ్రీ.. అయినా మ‌న స్టార్లు క‌ళారంగంలో ట్యాలెంట్ తో పాటు డిగ్రీలు సాధిస్తున్నారు. టాలీవుడ్ లో డిగ్రీలు ఎంత మంది చేసారు. ప్ర‌తిభ‌తో పాటు ప‌ట్టాలు సంపాదించిన హీరోల‌పై ఓ లుక్ వేద్దాం.

లెజెండ‌రీ క‌థానాయ‌కుడు నందమూరి తార‌క రామారావు డిగ్రీ పూర్తి చేసారు. న‌ట‌శిఖ‌రం అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట‌న‌పై మ‌క్కువ‌తో ప‌ద‌వ‌త‌ర‌గతితోనే సినిమాల్లోకి వ‌చ్చారు. సూప‌ర్ ప్టార్ కృష్ణ సి. ఆర్ కాలేజీలో డిగ్రీ చేసారు. అక్కినేని నాగార్జున అమెరికాలోని ఈస్ట‌ర్న్ మిచిగాన్ యూనివ‌ర్సీటీలో ఆటో మొబైల్ ఇంజ‌నీరింగ్ చేసారు. అందులో ఎమ్మెస్ కూడా పూర్తిచేసారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి న‌ర‌సాపురంలో వైఎం కాలేజీలో బికాం డిగ్రీ పూర్తి చేసారు. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ అమెరికాలో మానిట‌రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ లో ఎంబిఏ పూర్తి చేసారు. ఇక న‌ట‌సింహా బాల‌కృష్ణ హైద్రాబాద్ నిజాం కాలేజీ నుంచి కామ‌ర్ప్ ప‌ట్టా పొందారు. అలాగే రాజ‌శేఖ‌ర్ ఎంబీబీఎస్ పూర్తి చేసారు.

ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లండ‌న్ స్కూల్ ఆఫ్ ఆర్స్ట్ లో డిగ్రీ చేసారు. స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ బ్యాచిల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ ఎంఎస్ ఆర్ కాలేజీలో పూర్తి చేసారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్.. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ.. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య లు బికాం పూర్తి చేసారు. జూనియ‌ర్ ఎన్టీఆర్.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసారు. నేటిత‌రం స్టార్లు పీజీలు బిజినెస్ స్కూల్ స్ట‌డీస్ పూర్తి చేసి పెద్ద ఉద్యోగాలు చేసి సినీరంగంలోకి వ‌చ్చిన వాళ్లు ఉన్నారు. చాలా మంది డిగ్రీల‌తో ప‌ని లేకుండా స్టార్లుగా రాణిస్తున్నారు. డార్లింగ్ ప్ర‌భాస్ భీమ‌వ‌రం డీఎన్ ఆర్ స్కూల్లో చ‌దివాక శ్రీ చైత‌న్య‌లో బీటెక్ పూర్తి చేశారు.