Begin typing your search above and press return to search.

ఫిబ్ర‌వ‌రి ముగింపు..మార్చి తొలి వారం క‌లిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   26 Feb 2020 1:30 AM GMT
ఫిబ్ర‌వ‌రి ముగింపు..మార్చి తొలి వారం క‌లిసొచ్చేనా?
X
పెద్ద సినిమాల‌న్నీ సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ అవ్వ‌డంతో చిన్న సినిమాల‌కి లైన్ క్లియ‌ర్ అయింది. స‌రిలేరు నీకెవ్వ‌రు... అల వైకుంఠ‌పుర‌ములో రెండు..మూడు వారాల పాటు బాగానే కొన‌సాగింది. ఆ చిత్రాల స్పీడ్ త‌గ్గ‌గానే మిగ‌తా సినిమాలు ఒక్కొక్క‌టిగా అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాయి. మ్యాట‌ర్ ఉన్న సినిమాలు రాణించాయి...లేని సినిమాలు తేలిపోయాయి. మొత్తం జ‌న‌వ‌రి ముగించి ఫిబ్ర‌వ‌రి ఎండింగ్ కి వ‌చ్చేసాం....మ‌రో వారంలో కొత్త నెల మార్చి నెల‌కి అడుగు పెట్ట‌బోతున్నాం. అయితే ఈ రెండు మాసాల‌ను ఆధారం చేసుకుని ఫిబ్ర‌వ‌రి ఎండింగ్ లో కొన్ని సినిమాలు...మార్చి తొలి వారంలోనూ సినిమాలు భారీగానే రిలీజ్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఫిబ్ర‌వ‌రి 28న విశ్వ‌క్ సేన్ హీరోగా నాని నిర్మించి హిట్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ఇప్పటివ‌ర‌కూ స‌రైన ప్ర‌చారం లేదు. బ‌జ్ క్రియేట్ అవ్వ‌లేదు. గుడ్డి లో మెల్ల‌లా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇంకా ప‌లు లో బ‌డ్జెట్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక మార్చి 6న ప‌లాస 1978.. ఓ పిట్ట క‌థ‌.. అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఒక‌టి సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన ప్ర‌చారం కూడా లేక‌పోవ‌డంతో? ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయా? అన్న సందేహం క‌ల్గుతుంది. కామ‌న్ ఆడియ‌న్స్ కైతే ఈ సినిమాలు గురించి తెలియ‌ద‌నే టాక్ వినిపిస్తోంది.

థియేట‌ర్లు ఖాళీగా లేకుండా ఏదో సినిమా ఆడించాలి కాబ‌ట్టి రిలీజ్ అవుతున్నాయి. లేక‌పోతే వీటికి థియేట‌ర్లు కూడా దొర‌క‌వ‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. ఇక అర‌కొర‌గా థియేట‌ర్ కు వ‌చ్చి సినిమా చూసే స్టూడెంట్స్ కూడా ఇది ఎగ్జామ్స్ టైమ్. ఫిబ్ర‌వ‌రి లో ప్రాక్టిక‌ల్స్....మార్చిలో ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో స్టూడెంట్స్ అంతా ఆ టెన్ష‌న్ లోనే ఉంటారు. మ‌రి ఫిబ్ర‌వ‌రి ఎండింగ్..మార్చి మొద‌టి వారంలో వ‌స్తోన్న సినిమాలు ఎలా గ‌ట్టెక్కుతాయో చూడాలి.