Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూస‌ర్ కోలీవుడ్ సినిమా!

By:  Tupaki Desk   |   24 Nov 2022 11:30 AM GMT
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూస‌ర్ కోలీవుడ్ సినిమా!
X
స్టార్ ప్రొడ్యూస‌ర్ స్ర‌వంతి ర‌వికిషోర్ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఎంతో మంది స్టార్ హీరోల‌తో సినిమాలు నిర్మించిన చ‌రిత్ర ఆయ‌న సొంతం. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నిర్మాణ ప‌రంగా సెల‌క్టివ్ గా వెళ్తున్నారు. ఎక్కువ‌గా సినిమాలు రామ్ తోనే నిర్మిస్తున్నారు. బ‌య‌ట హీరోల‌తో సినిమాలు చేయ‌డం త‌గ్గించారు.

ఇండ‌స్ర్టీలో ఉన్న పోటీ స‌హా...నిర్మాణ వ్య‌యం పెరిగిపోవ‌డంతో గ‌త‌మంత వేగాన్ని ఇప్పుడు చూపించ‌డం లేదు. తాజాగా ఆయ‌న కోలీవుడ్ లో సైతం ఓ సినిమా నిర్మించిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆయ‌న నిర్మించిన 'కిడ' అనే సినిమా ఇటీవ‌లే గోవాలో జ‌రుగుతోన్న అంత‌ర్జాతీయ ఫిలిం పెస్టివ‌ల్స్ లో ఇండియ‌న్ పనోర‌మా విభాగంలో ప్ర‌ద‌ర్శించారు.

తాత ..మ‌న‌వ‌డు..ఓ మేక చుట్టూ తిరిగే ఈ క‌థ‌ని త‌మిళ ద‌ర్శ‌కకుడు ఆర్. ఏ వెంక‌ట్ తెర‌కెక్కించారు. ఈసంద‌ర్భంగా స్ర‌వంతి ర‌వి కిష‌ర్ ప‌సినిమా వెనుక క‌థ‌ని రివీల్ చేసారు.

'చెన్నై వెళ్లిన‌ప్పుడు ఓస్నేహితుడుని క‌లిసా. త‌న‌కి ఓ క‌థ చెప్పా. ఆ క‌థ న‌చ్చి ద‌ర్శ‌కుడుకి క‌బురు పెట్టా. అత‌ను ఈసినిమాని..క‌థ‌ని తెర‌కెక్కించాల‌నుకున్న విధానం న‌చ్చి వెంట‌నే ఒకే చెప్పా.

తొలి సినిమా అయినా బాగా తీయ‌గ‌ల‌డు అన్న న‌మ్మ‌కం క‌లిగింది. అత‌నికి పూర్తి స్వేచ్ఛ‌నిచ్చా. ఆ న‌మ్మ‌కాన్నినిలబెట్టాడు. మా సంస్థ‌కి ఇదేతొలి త‌మిళ సినిమా. గ‌తంలో చాలాసార్లు ఇక్క‌డ సినిమాచేయాల‌నుకున్నా.

అది ఇప్ప‌టికీ కుదిరింది. మంచి సినిమా తీస్తే ఎక్క‌డైనా తీచూస్తారు. సినిమాకి భాషా ప‌ర‌మైన హ‌ద్దులు లేదు. త్వ‌ర‌లోనే ఈచిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తామ‌ని' తెలిపారు. అలాగే విజ‌య్ హీరోగా తెర‌కెక్కుతోన్న 'వారిసు' సినిమాతో మ‌రో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజుకూడా త‌మిళ్ లో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతోన్న సంగ‌తి తెల‌సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.