మన హీరోలంతా గడ్డం గ్యాంగ్ లో చేరారు

Thu Oct 15 2020 06:00:05 GMT+0530 (IST)

Our Heroes joins the Beard Gang

ఒక సినిమాలో హీరో గెడ్డం పెంచితే అది సూపర్ హిట్ గా నిలిస్తే దాన్ని సెంటిమెంట్ గా భావిస్తుంటారు మన హీరోలు. దీంతో తదుపరి చిత్రాల్లో స్టోరీ డిమాండ్ ని బట్టి మన హీరోలు గడ్డాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ గడ్డాల హడావిడి టాలీవుడ్ లో మళ్లీ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి కూడా గెడ్డం పెంచేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ మూవీలో చిరు ఎండోమెంట్ అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే ఓ సన్నివేశంలో కామ్రేడ్ గానూ మాసిన గడ్డంతో కనిపించబోతున్నారు.మిగతా హీరోలు కూడా మళ్లీ గడ్డాలు పెంచుతున్నారండోయ్.. చిరుతో బాలయ్య కూడా గడ్డం విషయంలో పోటీపడుతున్నారు. బాలకృష్ణ కూడా బోయపాటి సినిమాలో గడ్డంతో కనిపించనున్నాడు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అఘోరాగా కనిపించే పాత్రలో గెడ్డంతో బాలకృష్ణ కనిపిస్తారట.

ఇక విక్టరీ వెంకటేశ్ కూడా `నారప్ప` కోసం గడ్డంతో నటిస్తున్నాడు మహేశ్ కూడా ఈసారి `సర్కారు వారి పాట`లో గెడ్డంతో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక కుర్ర హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా గడ్డంతో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ హీరో బారు గెట్టం... గుబురు మీసంతో వున్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఇక నాగ శౌర్య ... శర్వానంద్ తదితరులు గెడ్డంతోనే తన అప్ కమింగ్ సినిమాల్లో నటిస్తున్నారు. అన్నట్టు వీళ్లంతా కుంగ్ ఫూ హజిల్ (హాలీవుడ్ బ్లాక్ బస్టర్) లాంటి సినిమా తీస్తే అందులో గొడ్డలి గ్యాంగ్ లో చేరితే బావుంటుందేమో! గడ్డాలు పెంచి గొడ్డలి వేట సాగించవచ్చు!!