Begin typing your search above and press return to search.

ఆ విల్లాను చూడ‌గానే విల‌విల‌లాడుతున్నాడ‌ట‌!

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:00 AM GMT
ఆ విల్లాను చూడ‌గానే విల‌విల‌లాడుతున్నాడ‌ట‌!
X
కొన్ని జ్ఞాప‌కాల్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేరు. లైఫ్ జ‌ర్నీలో చాలా త‌మ వెంటే వ‌స్తుంటాయి. అంతేకాదు.. భూమి గుండ్రంగా తిరిగి అక్క‌డికే చేరిన చందంగా .. వ్య‌క్తులు కూడా అలా భ్ర‌మిస్తూ త‌మ‌కు ప్రేమ ఎక్క‌డ దొరికిందో అక్క‌డికే వెళుతుంటార‌నేది ఓ సిద్ధాంతం.

ఒక‌ప్పుడు ఆ విల్లాలోనే ప్రేమ వెల్లివిరిసింది. దాంప‌త్య‌జీవ‌నం ఎంతో మ‌ధురంగా సాగింది. ఆ హీరో- హీరోయిన్ మ‌ధ్య ఫ‌రిడ‌విల్లిన ఈ ప్రేమ‌కు సాక్ష్యంగా కొన్ని ఫోటోలు కూడా లీక‌య్యాయి. అవ‌న్నీ అంత‌ర్జాలంలో సంచ‌ల‌నంగానూ మారాయి. వివాహానంత‌రం పెంట్ హౌస్ అపార్ట్ మెంట్ లో విలాసాల జీవితం.. పూల్ సైడ్ గార్డెనింగ్ వ‌గైరా వ‌గైరా. అయితే కాల‌క్ర‌మంలో త‌మ బంధం బీట‌లు వారింది. ఇరువురు క‌ల‌త‌ల‌తో స‌ప‌రేట్ అయ్యారు. ఇది విధి. ఎవ‌రూ ఊహించ‌నిది. దీనిని అభిమానులు అంత తేలిగ్గా జీర్ణించుకోలేక‌పోయారు.

ఏదైతేనేం.. మ‌రోసారి విధి విచిత్రంగా ఉంది. ఇప్పుడు త‌మ ప్రేమ ఫ‌రిడ‌విల్లిన అదే విల్లాకు స‌మీపంలో మ‌రో విల్లాను కొనుగోలు చేసేందుకు విడాకుల అనంత‌రం స‌ద‌రు హీరో ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటి ఓన‌ర్ తో మంత‌నాలు సాగించార‌ని బేరం తెగేట్టు క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఆ విల్లాను కొంటే స‌మీపంలోనే ఉన్న ఆ పాత విల్లా జ్ఞాప‌కాలు త‌న‌ని వెంటాడుతాయేమో! అన్న సందేహం కొంద‌రిలో వ్య‌క్త‌మైంది. అయినా ఇప్పుడు వెతికిన ఆ పాత విల్లా ఎంతో సుంద‌ర‌మైన‌ది అని తెలిసింది. ఆ విల్లా అంటేనే స‌ద‌రు హీరో ప‌డి చ‌స్తున్నాడ‌ట‌.

పైగా త‌న రేస్ కార్ లు.. రేసింగ్ బైక్ ల‌ను పార్కింగ్ చేసేందుకు అనువైన స్థ‌లం కూడా అందుబాటులో ఉండ‌డంతో ఈ విల్లానే త‌న‌కు క‌రెక్ట్ అని భావిస్తున్నాడ‌ట‌. కొనుక్కున్నాక అవ‌స‌రం మేర లుక్ ఛేంజ్ లు వాస్తు వ‌గైరా మార్పులు చేయిస్తాట‌. అందుకే దానిని ఎట్టి ప‌రిస్థితిలో కొనేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ని.. అటుపై త‌న తండ్రి గారి విలాసాల భ‌వంతి నుంచి అక్క‌డికి షిఫ్ట్ అవుతాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికి ఇవ‌న్నీ కేవ‌లం గాసిప్స్ మాత్ర‌మే. కొన్న త‌ర్వాతే క‌దా ఇల్లు సొంత‌మైన‌ట్టు! అదీ సంగ‌తి!!