Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ని ఫాలో అవుతున్న టాలీవుడ్...!

By:  Tupaki Desk   |   8 July 2020 5:15 AM GMT
బాలీవుడ్ ని ఫాలో అవుతున్న టాలీవుడ్...!
X
'సినిమా' అనేది కొన్ని కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యవహారం. ప్రొడ్యూసర్స్ ఒక స్టోరీని హీరోని నమ్మి సినిమా మీద పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంటారు. ఆ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ లాభాల బాట పడతాడు.. అదే సినిమా ప్లాప్ అయితే నష్టాలు చవి చూడాల్సిందే. అందుకే నిర్మాతలు సినిమాకి పెట్టే బడ్జెట్ విషయంలో అన్ని లెక్కలు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి ఇతర నిర్మాతలతో కలిసి పాలు పంచుకుంటుంటారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ప్రొడ్యూసర్స్ భాగస్వామ్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే లాభాలు పంచుకుంటారు.. ప్లాప్ అయితే నష్టాలు పంచుకుంటారు. మొత్తం మీద నిర్మాతల మీద ఫైనాన్సియల్ ప్రెజర్ లేకుండా చూసుకుంటారు.

ఇప్పుడు ఇదే పద్ధతి సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా వచ్చింది. మన టాలీవుడ్ లో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ కలిసి సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేసారు. అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగార్జున - సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు - గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ - వైజయంతీ మూవీస్ అశ్వినీదత్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు - శ్యాం ప్రసాద్ రెడ్డి - పీవీపీ - అనిల్ సుంకర లాంటి వారు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారు. 'కింగ్' నాగార్జున తన బ్యానర్ లో నిర్మించే ప్రతి సినిమాకి మరో నిర్మాతని భాగస్వామిగా చేర్చుకుంటూ వస్తున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ రిలీజైన 'మహర్షి సినిమా కోసం అశ్వినీ దత్ - పీవీపీ - అనిల్ సుంకర కలిసి ప్రొడక్షన్ చేసారు. 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాకి దిల్ రాజు - మహేష్ బాబు - అనిల్ సుంకర ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. 'అల వైకుంఠపురంలో' సినిమాకి అల్లు అరవింద్ - యస్. రాధాకృష్ణ ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. సురేష్ బాబు నిర్మించిన 'ఓ బేబీ' సినిమాకి పీపుల్స్ మీడియా వారు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు.

రాబోయే చిత్రాల్లో కూడా చాలా వరకు ఈ పద్ధతినే ఫాలో అవుతూ వస్తున్నారు. 'సర్కారు వారి పాట' సినిమా కోసం 14 రీల్స్ ప్లస్ - జీఎంబీ ఎంటెర్టైన్మెంట్స్ - మైత్రీ మూవీ మేకర్స్ వారు కలిశారు. ఇక 'మేయర్' సినిమా కోసం మహేష్ బాబు సోనీ పిక్చర్స్ వారితో టై అప్ అయ్యారు. 'పుష్ప' సినిమాని మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించనున్నారు. 'వకీల్ సాబ్' చిత్రాన్ని దిల్ రాజు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ప్రభాస్ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ - గోపీ కృష్ణ బ్యానర్స్ కలిశాయి. 'ఆచార్య' సినిమాని కొణెదల ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా కలిసి నిర్మిస్తున్నారు.

ఈ విధంగా ప్రతి సినిమాకి కొందరు ప్రొడ్యూసర్స్ కలిసి బడ్జెట్ షేర్ చేసుకుంటూ ఫైనాన్సియల్ ప్రెజర్ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కరోనా పరిస్థితుల వలన ప్రతి ప్రొడ్యూసర్ ఆ దిశగా అడుగులు వేయనున్నారు. అంతేకాకుండా స్టార్ హీరోలకు డైరెక్టర్స్ కి రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇచ్చేలా ఆలోచనలు స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది హీరోలు కూడా తాము నటించబోయే సినిమాలకు కో ప్రొడ్యూసర్స్ గా కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా నిర్మాణం విషయంలో బాలీవుడ్ ని ఫాలో అవుతోందని చెప్పవచ్చు.