200 కోట్ల క్లబ్ లో మన స్టార్ హీరోలు

Tue Jan 24 2023 14:53:52 GMT+0530 (India Standard Time)

Tollywood Films in 200 Crores Club

ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ మెగా లెవల్ లో పునరాగమనం చేసిన మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో కేవలం 3 రోజుల్లో 100 కోట్ల మార్క్ అందుకుని వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 100 కోట్ల సినిమాగా నిలిచింది. సినిమా విడుదలైన 10 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. మెగాస్టార్ మూవీ 200 కోట్ల క్లబ్‌లో చేరడంతో ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన టాలీవుడ్ మూవీస్ ఎన్ని అనే చర్చ మొదలైంది. అవేంటో ఇప్పుడో లుక్ వేద్దాం.టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. దక్షిణాది నుండి ముఖ్యంగా తెలుగు భాష నుండి వచ్చిన సినిమాలో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది.

దక్షిణాదిలో దేశవ్యాప్తంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగు భాషా చిత్రలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. 100 కోట్ల క్లబ్ లో చేరడమే గగనం అనుకుంటే 100 దాటి 200 కోట్లు రాబట్టిన సినిమాలో టాలీవుడ్ చాలానే ఉన్నాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా 10కి పైగా టాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ సాధించాయంటే మాటలు కాదు.

200 కోట్లు సాధించిన టాలీవుడ్ చిత్రాల్లో ప్రభాస్ సినిమాలే మూడున్నాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి బాహుబలి-2 చిత్రాలతో పాటు సుజీత్ డైరెక్ట్ చేసిన సాహో సినిమా ఉంది. బాహుబలి-2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1810 కోట్లకు పైగా వసూలు చేసింది.

బాహుబలి-1 రూ.605 కోట్లు సాహో 435 కోట్లు రాబట్టింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి రూ. 236 కోట్లకు పైగా వసూలు చేయగా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ ఇప్పటి వరకు రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. లాంగ్ రన్‌లో ఎంత వసూలు చేస్తుందో చూడాల్సి ఉంది.

రాంచరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం రూ. 216 కోట్లు రాంచరణ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ రూ.1152 కోట్లు రాబట్టింది. అల్లుఅర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో రూ. 257 కోట్లు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప రూ. 360 కోట్లు రాబట్టింది. మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రామ్‌కామ్ మూవీ సరిలేరు నీకవ్వరు రూ. 224 కోట్లు వసూలు చేసింది. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.